Share News

Rohit Sharma: రోహిత్ శర్మ లైట్ తీసుకోడు: రవిశాస్త్రి

ABN , Publish Date - Oct 29 , 2024 | 11:29 AM

టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్ భారత్‌లో తన మొదటి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. జట్టు కెప్టెన్ రోహిత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ మాజీ క్రికెట్ దిగ్గజం అతడిపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

Rohit Sharma: రోహిత్ శర్మ లైట్ తీసుకోడు: రవిశాస్త్రి
Rohit Sharma

ముంబై: రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే భారత జట్టు ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. దీంతో న్యూజిలాండ్‌తో మరో టీ20 గెలుపు కూడా మనదే అని టీమిండియా ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. కానీ, ఎవ్వరూ ఊహించని రీతిలో స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచిన భారత్‌ తొలిసారి న్యూజిలాండ్‌ చేతిలో చిత్తైంది. పూణె టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనిపై భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి పెద్ద తాజాగా స్పందించాడు. భారత్ ఇప్పటివరకు అతడి సారథ్యంలో 28 టెస్ట్ మ్యాచ్‌లు గెలిచిందని, రోహత్ కోచింగ్‌లో జట్టు 60 శాతానికి పైగా విజయాలు నమోదు చేసిన విషయాన్ని మరొవద్దని గుర్తుచేశాడు.


డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితి వేరు

పూణెలో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ గురించి రవిశాస్త్రి వ్యాఖ్యానిస్తూ, "నేను కచ్చితంగా చెప్పగలను. రోహిత్ శర్మ ఈ ఓటమిని తేలికగా తీసుకోడు. అతను బయటికి చాలా రిలాక్స్‌గా కనిపించవచ్చు. కానీ ఈ ఓటమి అతని హృదయాన్ని తీవ్రంగా గాయపరిచి ఉంటుంది. అతనొక్కేడే కాదు టీమిండియా జట్టులో ప్రతి ఒక్కరూ డ్రెస్సింగ్ రూమ్‌లో నిరాశలో కూరుకుపోయి ఉంటుంది" అని రవిశాస్త్రి అన్నాడు. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా జట్టు చాలా బాగా రాణిస్తోందని, అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో జరిగిన ఒకే ఒక తప్పును క్షమించాలని కోరాడు.


జట్టు వైఫల్యమే..

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. మేం బ్యాటింగ్‌లో రాణించలేకపోయాం.. తొలి ఇన్నింగ్స్‌లో మరికొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఇప్పుడు పూర్తి ఉత్సాహంతో వాంఖడే స్టేడియంలోకి అడుగుపెట్టి ఆ మ్యాచ్ ను గెలవడమే మా లక్ష్యం. ఇది కేవలం బ్యాటింగ్ లేదా బౌలింగ్‌ వైఫల్యం అని నేను నిందించను. పూర్తిగా జట్టు వైఫల్యంగానే చూస్తాను.


రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డు

2022లో టీమిండియా కెప్టెన్సీని చేపట్టిన రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ 20 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. అందులో 12 గెలిచింది.6 ఓడిపోగా 2 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అతని కెప్టెన్సీలో, భారత జట్టు విజయాల శాతం 60 శాతంగా ఉంది. అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్లలో ఒకరిగా రోహిత్ శర్మకు పేరుంది.

KL Rahul: కేఎల్ రాహుల్‌కు లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని షాక్..


Updated Date - Oct 29 , 2024 | 11:29 AM