Share News

IPL 2024: మళ్లీ మొదలైన RCB vs CSK మ్యాచ్.. మళ్లీ ఆగిపోతే ఏం చేస్తారంటే

ABN , Publish Date - May 18 , 2024 | 08:34 PM

2024 ఐపీఎల్(IPL 2024) 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో 68వ మ్యాచ్ మొదలైన మూడు ఓవర్లకే వర్షం కారణంగా ఆగిపోయి, మళ్లీ 8.25 గంటలకు మొదలైంది. అయితే మళ్లీ మ్యాచ్ ఆగిపోతే ఏం చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం.

IPL 2024: మళ్లీ మొదలైన RCB vs CSK మ్యాచ్.. మళ్లీ ఆగిపోతే ఏం చేస్తారంటే
ipl 2024 RCB vs CSK 68th match

2024 ఐపీఎల్(IPL 2024) 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో 68వ మ్యాచ్ మొదలైన మూడు ఓవర్లకే వర్షం కారణంగా ఆగిపోయి, మళ్లీ 8.25 గంటలకు మొదలైంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెల్చిన చెన్నై జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ క్రమంలో ఓపెనర్ విరాట్ కోహ్లీ (19 పరుగులు), కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (12 పరుగులు) చేసి క్రీజులో ఉండగానే వర్షం వచ్చింది. దీంతో 3 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 31 పరుగులు చేసిన సమయంలో మ్యాచ్ నిలిపివేశారు.


ఈ నేపథ్యంలో మళ్లీ వర్షం తగ్గడంతో కవర్లు తీసివేశారు. దీంతో మ్యాచ్ మళ్లీ 8:25 గంటల తర్వాత పునఃప్రారంభించారు. వర్షం కారణంగా మళ్లీ మ్యాచ్ ఆగిపోతే ఓవర్లను కట్ చేస్తారు. 20 ఓవర్ల మ్యాచుని 10-10 ఓవర్లు లేదా 5-5 ఓవర్ల మ్యాచుకు కుదించే అవకాశం ఉంది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్లు ప్లేఆఫ్‌కు చేరే అవకాశం ఉంది. CSK గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు సులభంగా చేరుతుంది. అయితే RCB కనీసం 18 పరుగుల తేడాతో గెలవాలి. RCB 17 లేదా అంతకంటే తక్కువ పరుగుల తేడాతో గెలిస్తే, తక్కువ నెట్ రన్ రేట్ ఆధారంగా నిష్క్రమించబడుతుంది.


ఇవి కూడా చదవండి..

Virat Kohli: ధోనీ, నేను కలిసి ఆడడం ఇదే చివరి సారేమో.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!


Virat Kohli: రిటైర్‌మెంట్‌పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. ఒక్కసారి వీడ్కోలు పలికితే..

Read Latest Sports News and Telugu News

Updated Date - May 18 , 2024 | 08:37 PM