Share News

MS Dhoni vs Rohit Sharma: ఆ విషయంలో ధోనీ కన్నా రోహిత్ శర్మనే చాలా బెటర్

ABN , Publish Date - Mar 20 , 2024 | 06:19 PM

కెప్టెన్సీ విషయంలో ఎవరు బెటర్? అనే ప్రస్తావన వస్తే.. మెజారిటీ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) పేరునే తీసుకుంటారు. తోటి ఆటగాళ్లతో ఎంతో స్నేహంగా ఉంటాడని, కెప్టెన్‌గా జట్టుని సమర్థవంతంగా నడిపిస్తాడని, ఒత్తిడి సమయాల్లోనూ చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తాడని అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు. కానీ.. మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel) మాత్రం అందుకు భిన్నంగా సమాధానం ఇచ్చాడు.

MS Dhoni vs Rohit Sharma: ఆ విషయంలో ధోనీ కన్నా రోహిత్ శర్మనే చాలా బెటర్

కెప్టెన్సీ విషయంలో ఎవరు బెటర్? అనే ప్రస్తావన వస్తే.. మెజారిటీ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) పేరునే తీసుకుంటారు. తోటి ఆటగాళ్లతో ఎంతో స్నేహంగా ఉంటాడని, కెప్టెన్‌గా జట్టుని సమర్థవంతంగా నడిపిస్తాడని, ఒత్తిడి సమయాల్లోనూ చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తాడని అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు. కానీ.. మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel) మాత్రం అందుకు భిన్నంగా సమాధానం ఇచ్చాడు. సారథిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను మెరుగ్గా నిర్వహించడంలో ధోనీ కన్నా రోహిత్ శర్మనే (Rohit Sharma) బెటరని పేర్కొన్నాడు. అంతేకాదు.. కీలకమైన సమయాల్లో ధోనీ కంటే రోహిత్ కచ్ఛితమైన నిర్ణయాలు తీసుకున్నాడని కూడా అభిప్రాయపడ్డాడు. క్లిష్టమైన సమయాల్లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుని గట్టెక్కించడంలోనూ రోహిత్ ప్రధాన పాత్ర పోషించాడని కితాబిచ్చాడు.


పార్థివ్ పటేల్

‘‘ఒక మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నప్పుడు.. చెన్నై సారథిగా ధోనీ కొన్ని సందర్భాల్లో పొరపాట్లు, అంతకన్నా పెద్ద తప్పులు చేశాడు. కానీ.. రోహిత్ శర్మ మాత్రం అలాంటి తప్పిదాలు ఎప్పుడూ చేయలేదు. రోహిత్ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటూనే.. జట్టును సమర్థవంతంగా నడిపించే తీరు ఇతరులతో పోల్చలేం. ఇందుకు.. కేవలం ఒక్క పరుగు తేడాతోనే ముంబై జట్టు రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ నెగ్గడమే ఉత్తమ ఉదాహరణ. సాధారణంగా.. ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. కానీ.. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముఖ్యమైన లక్షణం ఏంటంటే.. గత పదేళ్లలో అతడు చేసిన తప్పు ఒక్కటి కూడా గుర్తుకు రాదు. కీలక సమయంలో పవన్‌ నేగికి (Pawan Negi) ఓవర్‌ ఇవ్వడం లాంటివి ధోనీ చేశాడు కానీ, రోహిత్ మాత్రం అలాంటి బ్లండర్లు చేయలేదు’’ అంటూ పార్థివ్ పటేల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

జహీర్ ఖాన్

భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) కూడా పార్థివ్ పటేల్ స్టేట్‌మెంట్‌కు మద్దతు తెలుపుతూ.. రోహిత్ శర్మపై కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కచ్ఛితమైన నిర్ణయాలు తీసుకోవడంలో రోహిత్‌కు సాటి లేరని అన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా రోహిత్ నిర్ణయాలు తీసుకుంటాడని, మ్యాచ్‌ను గుప్పిట్లో ఉంచుకోవడానికి చివరివరకూ ప్రయత్నాలు చేస్తాడని తెలిపాడు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కెప్టెన్‌కు కఠినమైన సవాల్ లాంటిదని.. ఇలాంటి నిర్ణయాల్ని ముంబయి జట్టు కోసం రోహిత్ ఎన్నో తీసుకున్నాడని జహీర్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 20 , 2024 | 06:19 PM