Share News

Paris Olympics 2024: రిషబ్ పంత్ అదిరిపోయే ఆఫర్.. వారికి లక్ష బహుమతి..!

ABN , Publish Date - Aug 07 , 2024 | 09:20 PM

Neeraj Chopra - Paris Olympics 2024: భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మంగళవారం ఒక్క త్రో తో సంచలనం సృష్టించాడు. నీరజ్ గోల్డ్ మెడల్ సాధిస్తాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. మంగళవారం జరిగిన సింగిల్ త్రో లో నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు.

Paris Olympics 2024: రిషబ్ పంత్ అదిరిపోయే ఆఫర్.. వారికి లక్ష బహుమతి..!
Paris Olympics 2024

Neeraj Chopra - Paris Olympics 2024: భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మంగళవారం ఒక్క త్రో తో సంచలనం సృష్టించాడు. నీరజ్ గోల్డ్ మెడల్ సాధిస్తాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. మంగళవారం జరిగిన సింగిల్ త్రో లో నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు. దీంతో నీరజ్ చోప్రాకు మద్దతుగా అభిమానులను పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఇదే సమయంలో క్రికెటర్లు సైతం నీరజ్ చోప్రాకు మద్ధతుగా నిలుస్తున్నారు. నీరజ్‌ను ఎంకరేజ్ చేసేందుకు.. అతని అభిమానులకు బంపర్ ఆఫర్స్ ఇస్తున్నారు సెలబ్రిటీస్. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్.. అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించారు. మరి ఆ ఆఫర్స్ ఏంటో ఓసారి చూద్దాం..


భారత్-పాక్ మధ్య పోటీ..

ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తరఫున నీరజ్ చోప్రా అర్హత సాధించగా, పాకిస్థాన్ తరఫున అర్షద్ నదీమ్ అర్హత సాధించాడు. దీంతో ఫైనల్స్‌పై ఉత్కంఠ మరింత పెరిగింది. క్వాలిఫైయింగ్‌లో.. ఆటగాళ్లందరూ నీరజ్ చోప్రా త్రోకు చేరువయ్యేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించారు. కానీ. ఎవరూ నీరజ్‌ను బీట్ చేయలేకపోయారు.


రిషబ్ పంత్, కావ్యా మారన్ ఆఫర్స్..

నీరజ్ చోప్రాకు మద్దతుగా అభిమానుల కోసం రిషబ్ పంత్ లక్షల రూపాయల ఆఫర్ ప్రకటించాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశాడు. ‘నీరజ్ చోప్రా రేపు స్వర్ణం గెలిస్తే. ట్వీట్‌ను ఎక్కువగా లైక్ చేసిన, కామెంట్స్‌ చేసిన వారిలో అదృష్టవతుండొకరికి రూ. 100089 ఇస్తాను. అలాగే, మిగిలిన టాప్ 10 మెంబర్స్‌కు విమాన టిక్కెట్లు ఇస్తాను. నీరజ్‌ భాయ్‌కి భారతదేశం తరఫునే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మద్ధతు ఉంటుంది.’ అని రిషబ్ పంత్ పేర్కొన్నాడు.

ఇక కావ్యా మారన్ సైతం ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించింది. ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే.. తన పోస్టుకు లైక్స్, కామెంట్స్ పెట్టిన వారిలో ఎవరో ఒకరికి రూ. 1,00,099 ఇస్తానని ప్రకటించింది. అయితే, వీరు ఇచ్చే ఆఫర్ల కోసం కాదు గానీ.. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాలని నెటిజన్లు ఎంతో ఆశిస్తున్నారు. నీరజ్‌కు తమ మద్ధతును ప్రకటిస్తున్నారు.


ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

మంగళవారం జరిగిన సింగిల్ త్రోలో నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు. గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా కెరీర్‌లోనే ఇది రెండో అత్యుత్తమ త్రో. కాగా, నీరజ్ చోప్రా ఇప్పుడు ఫైనల్‌కు రెడీగా ఉన్నాడు. క్వాలిఫై అయ్యాక తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని కూడా ప్రకటించాడు. నీరజ్ చోప్రాతో అర్షద్ సైతం పోటీకి సిద్ధమయ్యాడు. ఈ గ్రేట్ మ్యాచ్ ఆగష్టు 8వ తేదీన రాత్రి 11.50 గంటలకు ప్రారంభమవుతుంది.


Also Read:

వన్డే సిరీస్ లంకదే.. 110 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి!

వినేష్‌ అనర్హతపై కేంద్రం ప్రకటన..

సతీమణి భువనేశ్వరి సీఎం గిఫ్ట్.. ఏం ఇచ్చారో తెలుసా..?

For More Sports News and Telugu News..

Updated Date - Aug 07 , 2024 | 09:20 PM