Share News

Rohan Bopanna: చరిత్ర సృష్టించిన భారత టెన్నిస్ దిగ్గజం.. 43 ఏళ్ల వయసులో..

ABN , Publish Date - Jan 24 , 2024 | 11:54 AM

భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. టెన్నిస్ పురుషుల విభాగంలో నంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. 43 ఏళ్ల వయసులో బోపన్న ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించి సరికొత్త చరిత్ర లిఖించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్ చేరడం ద్వారా బోపన్న మొదటి ర్యాంకు చేరుకున్నాడు.

Rohan Bopanna: చరిత్ర సృష్టించిన భారత టెన్నిస్ దిగ్గజం.. 43 ఏళ్ల వయసులో..

భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. టెన్నిస్ పురుషుల విభాగంలో నంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. 43 ఏళ్ల వయసులో బోపన్న ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించి సరికొత్త చరిత్ర లిఖించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్ చేరడం ద్వారా బోపన్న మొదటి ర్యాంకు చేరుకున్నాడు. దీంతో టెన్నిస్ చరిత్రలో అత్యధిక వయసులో నంబర్‌వన్ ర్యాంకు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. దీంతో గతంలో అమెరికాకు చెందిన రాజీవ్ రామ్ పేరు మీద ఉన్న ఈ రికార్డును బోపన్న బద్దలుకొట్టాడు. కాగా రాజీవ్ రామ్ 38 ఏళ్ల వయసులో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించాడు. అయితే ఈ ర్యాంకులను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ జరుగుతోంది. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ ముగిశాక ఈ ర్యాంకులను అధికారికంగా ప్రకటిస్తారు. తన 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌లో నంబర్ వన్ ర్యాంకు సాధించడం బోపన్నకు ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన నాలుగో భారత టెన్నిస్ ప్లేయర్‌గా బోపన్న నిలిచాడు. బోపన్న కంటే ముందు నంబర్ వన్ ర్యాంకును లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మీర్జా ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించారు.


కాగా ఆస్ట్రేలియా ఓపెన్‌ డబుల్స్ బరిలోకి దిగడానికి ముందు బోపన్న మూడో ర్యాంకులో ఉన్నాడు. ఈ గ్రాండ్‌స్లామ్‌లో మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి బోపన్న బరిలోకి దిగాడు. టోర్నీలో వరుస విజయాలతో అదరగొడుతున్న ఈ జోడి సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన క్వార్డర్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనాకు చెందిన మాక్సిమో గొంజాలెజ్, ఆండ్రూ మోల్టెని జంటపై బోపన్న జోడి 6-4, 7-6తో వరుస సెట్లలో విజయం సాధించింది. గంట 46 నిమిషాలపాటు ఈ సెట్ సాగింది. ఈ విజయంతో మాథ్యూ ఎబ్డెన్‌ కూడా తన ర్యాంకును మెరుగుపరచుకున్నాడు. మాథ్యూ ఎబ్డెన్‌ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్ చేరడం బోపన్నకు ఇదే మొదటి సారి కావడం గమనార్హం. బోపన్న ఇప్పటివరకు మొత్తం 17 సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగాడు. కాగా గతేడాది బోపన్న జోడి యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. దీంతో అత్యధిక వయసులో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన ఆటగాడిగా బోపన్న చరిత్ర సృష్టించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 24 , 2024 | 11:56 AM