Share News

Ind vs Ban: మళ్లీ నిరాశపరిచిన శాంసన్.. దుమ్మురేపిన హార్దిక్

ABN , Publish Date - Jun 01 , 2024 | 10:06 PM

సంజూ శాంసన్‌కి అదేం దురదృష్టమో ఏమో తెలీదు కానీ.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంటాడు. రాకరాక తనకు అవకాశం వస్తే..

Ind vs Ban: మళ్లీ నిరాశపరిచిన శాంసన్.. దుమ్మురేపిన హార్దిక్

సంజూ శాంసన్‌కి (Sanju Samson) అదేం దురదృష్టమో ఏమో తెలీదు కానీ.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంటాడు. రాకరాక తనకు అవకాశం వస్తే.. దాన్ని కూడా సరిగ్గా వినియోగించుకోలేక పోతుంటాడు. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం టీమిండియా స్క్వాడ్‌లో ఎంపికైన అతను మళ్లీ నిరాశపరిచాడు. బంగ్లాదేశ్‌తో (Bangladesh) జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కేవలం ఒక్క రన్ మాత్రమే కొట్టి ఔట్ అయ్యాడు.


ఈ వార్మప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో (Rohit Sharma) కలిసి ఓపెనర్‌గా దిగిన సంజూ శాంసన్ (6 బంతుల్లో 1).. షోరిఫుల్ ఇస్లామ్ వేసిన రెండో ఓవర్‌లో ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. నిజానికి.. ఐపీఎల్ 2024లో శాంసన్ ఒక కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగానూ అదరగొట్టాడు కాబట్టి, ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తాడని అంతా అనుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అదే నమ్మకంతో అతడిని ఓపెనర్‌గా రంగంలోకి దింపాడు. కానీ.. శాంసన్ ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఆరు బంతులాడిన అతను ఒక్క పరుగే చేసి పెవిలియన్ బాట పట్టాడు.


మరోవైపు.. ఐపీఎల్‌లో ఘోర ప్రదర్శనతో తారాస్థాయి విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మాత్రం తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ వార్మప్ మ్యాచ్‌లో ఐదో స్థానంలో దిగిన అతను.. 22 బంతుల్లో 2 ఫోర్లు, నాలుగు సిక్సులతో 40 పరుగులు చేశాడు. హార్దిక్ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే.. భారత్ 182 పరుగులు చేయగలిగింది. మొత్తానికి.. అతని నుంచి క్రీడాభిమానులు ఏదైతే కోరుకున్నారో, అలాంటి ఇన్నింగ్స్ ఆడి అందరి మనసులు దోచుకున్నాడు. ఈ మెగా టోర్నీ మొత్తం అతను ఇదే దూకుడు కంటిన్యూ చేయాలని కోరుతున్నారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 10:06 PM