Share News

Team India: రెండవ టెస్టులో శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ ఆడతారా.. బిగ్ అప్‌డేట్

ABN , Publish Date - Oct 22 , 2024 | 07:18 PM

పుణే టెస్టుకు స్టార్ బ్యాటర్లు శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ ఫిట్‌గా అందుబాటులో ఉంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వీళ్లిద్దరూ అందుబాటులో ఉంటారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌చేట్ క్లారిటీ ఇచ్చాడు.

Team India: రెండవ టెస్టులో శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ ఆడతారా.. బిగ్ అప్‌డేట్

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. గురువారం నుంచి పుణే వేదికగా జరగనున్న రెండవ టెస్ట్ కోసం ఇరు జట్లు ఎదురుచూస్తున్నాయి. అయితే సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడడంతో రెండవ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని టీమిండియా యోచిస్తోంది. స్వదేశంలో బలమైన రికార్డును చెక్కుచెదరకుండా కాపాడుకోవాలని ఆటగాళ్లు భావిస్తున్నారు.


అయితే పుణే టెస్టుకు స్టార్ బ్యాటర్లు శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ ఫిట్‌గా అందుబాటులో ఉంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మెడ నొప్పి కారణంగా శుభ్‌మాన్ గిల్ తొలి మ్యాచ్‌ ఆడలేకపోయాడు. రిషబ్ పంత్ బెంగళూరు టెస్టులో 2వ రోజున మోకాలి గాయానికి గురయ్యాడు. కాలికి శస్త్ర చికిత్స జరిగిన భాగంలోనే బంతి తగలడంతో వాపు వచ్చింది. దీంతో పంత్ మైదానాన్ని వీడాడు. అయితే రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి అద్భుతంగా రాణించాడు. దీంతో కీలకమైన ఈ ఆటగాళ్లు ఇద్దరూ పుణే టెస్టుకు అందుబాటులో ఉంటారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే వీరిద్దరి ఫిట్‌నెస్‌పై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌చేట్ క్లారిటీ ఇచ్చాడు. ఇద్దరూ పుణే టెస్టులో ఆడేందుకు ఫిట్‌గా ఉండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు.


‘‘రిషబ్ పంత్ బాగానే ఉన్నాడు. మొదటి టెస్టు ముగిసిన మరుసటి రోజున కెప్టెన్ రోహిత్ ఈ విషయాన్ని ప్రస్తావించాడని భావిస్తున్నాను. మోకాలితో కదలిక విషయంలో పంత్‌కు కొంత అసౌకర్యం ఉంది. పరిస్థితి మెరుగుగా ఉంటే ఈ టెస్ట్‌లో కూడా అతడిని ఆడించడం మంచిది’’ అని డోస్‌చేట్ అభిప్రాయపడ్డాడు.

ఇక యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ రెండవ మ్యాచ్‌కు ఫిట్‌గా ఉండవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ గిల్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. అతడు కాస్త ఇబ్బంది పడుతున్నాడు. మరోసారి టెస్ట్‌ చేయించుకోవడం మంచిదని నేను భావిస్తున్నాను’’ అని ఆయన చెప్పారు.


కాగా బెంగళూరు టెస్టులో రిషబ్ పంత్ గాయపడడంతో అతడి స్థానంలో ధృవ్ జురెల్ వచ్చి కీపింగ్ చేశాడు. అయితే రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన పంత్ అద్భుతంగా ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. జాగ్రత్తగా 99 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఒక్క పరుగు తేడాతో సెంచరీని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే వికెట్ల మధ్య నడుస్తున్నప్పుడు కాస్త అసౌకర్యానికి గురైనట్టు కనిపించింది.


ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్లపై వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలు.. జరిగిన తప్పు ఇదే

సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

పసిడి ప్రియులకు భారీ షాక్.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ఏఐ వినియోగంలో జర జాగ్రత్త

For more Sports News and Business News and Telugu News

Updated Date - Oct 22 , 2024 | 07:24 PM