Share News

T20 Worldcup: స్టేడియంలో రోహిత్, కోహ్లీ భార్యలను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది: సౌరవ్ గంగూలీ

ABN , Publish Date - Jun 01 , 2024 | 06:08 PM

భారత తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లపై ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. మన దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. కోట్లలో అభిమానులు ఉంటారు. క్రికెటర్లను దేవుళ్లలా కొలుస్తుంటారు. వారి మీద విపరీతమైన ఒత్తిడి పెడుతుంటారు.

T20 Worldcup: స్టేడియంలో రోహిత్, కోహ్లీ భార్యలను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది: సౌరవ్ గంగూలీ
Ritika sajdeh, Anushka Sharma

భారత తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లపై ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. మన దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. కోట్లలో అభిమానులు ఉంటారు. క్రికెటర్లను దేవుళ్లలా కొలుస్తుంటారు. వారి మీద విపరీతమైన ఒత్తిడి పెడుతుంటారు. ఇక, ఐసీసీ మెగా టోర్నీలంటే ఇతర దేశాల ఆటగాళ్లతో పోల్చుకుంటే భారత క్రికెటర్లకు బోలెడంత ఒత్తిడి (Pressure)ఉంటుంది. మరికొద్ది గంటల్లో టీ-20 ప్రపంచకప్ (T20 Worldcup) ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీలో భారత అవకాశాలపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) స్పందించాడు.


``రాహుల్ ద్రవిడ్ ఛాంపియన్ క్రికెటర్. వ్యూహాలు వేయడంలో అతడిని మించిన వారు లేరు. కానీ, విపరీతమైన ఒత్తిడి ఎంతటి వారికైనా ఆందోళన కలిగిస్తుంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టాండ్స్‌లో ఉండే రోహిత్ శర్మ భార్య రితిక (Ritika sajdeh), కోహ్లీ భార్య అనుష్కల (Anushka Sharma) మొహాలు చూస్తే అర్థమవుతుంది.. వారు ఎంత ఒత్తిడి అనుభవిస్తున్నారో. ఆటగాళ్లపై భారీగా ఆశలు పెట్టుకుంటే మనమే వారిపై భరించలేనంత ఒత్తిడి పెంచేస్తున్నాం. ఐపీఎల్ ఫైనల్ వంటి మెగా టోర్నీలో స్వేచ్ఛగా ఆడే వాతావరణం కల్పించగలగాలి`` అని గంగూలీ పేర్కొన్నాడు.


2023 ప్రపంచకప్ ఫైనల్లో తాము ఓడిపోవడానికి విపరీతమైన ఒత్తిడే కారణమని, ఆటగాళ్లు రిలాక్స్ కావడానికి ప్రయత్నించాలని గంగూలీ సూచించాడు. కాగా, అమెరికాం-వెస్టిండీస్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న టీ-20 ప్రపంచకప్‌లో ఈ నెల 5వ తేదీన భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఆరోజు ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇక, జూన్ 9వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది.

ఇవి కూడా చదవండి..

T20 World Cup 2024: నేడే టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం.. కానీ ఇండియాలో మాత్రం


Ind vs Pak: లోన్ వోల్ఫ్ ఎటాక్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 01 , 2024 | 06:08 PM