Share News

Apple Watch: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ఆపిల్ వాచ్ సిరీస్ 10.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Sep 07 , 2024 | 02:55 PM

ఈ సంవత్సరం ఆపిల్ వాచ్ 10వ వార్షికోత్సవం కావడంతో ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ 10కు ఈ సంవత్సరం రానున్న ఈవెంట్ ఎంతో ప్రత్యేకం. దీనిపై ఇంకా సమాచారం లేనప్పటికీ, డిజైన్, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్ల గురించి మాత్రం కొన్ని లీక్స్ బయటకొచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 Apple Watch: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ఆపిల్ వాచ్ సిరీస్ 10.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Apple Watch Series 10

ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త ఐఫోన్‌తో పాటు కొత్త స్మార్ట్‌వాచ్‌లను(Apple Watch) కూడా పరిచయం చేయబోతోంది. అయితే ఈ సంవత్సరం వాచ్ 10వ వార్షికోత్సవం కావడంతో ఆపిల్ స్మార్ట్‌వాచ్‌ 10కు ఈ సంవత్సరం రానున్న ఈవెంట్ ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు. అయితే ఆపిల్ స్మార్ట్‌వాచ్‌కు ఏం పేరు పెడతారనేదానిపై చర్చ నెలకొంది. దీనిపై ఇంకా సమాచారం లేనప్పటికీ, డిజైన్, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్ల గురించి మాత్రం కొన్ని లీక్స్ బయటకొచ్చాయి.


క్రమంగా పెంపు

గత కొన్ని సంవత్సరాలుగా ఆపిల్ వాచ్‌లో స్క్రీన్ పరిమాణాన్ని ఆపిల్ క్రమంగా పెంచుతోంది. అధికారికంగా తెలియనప్పటికీ రాబోయే స్మార్ట్‌వాచ్ 45mm, 49mmలలో ఉంటుందని తెలుస్తోంది. ఇది ప్రస్తుత 41mm, 45mm పరిమాణాల కంటే చాలా పెద్దదిగా ఉంటుందని Apple విశ్లేషకుడు Ming Chi Kuo అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా Apple వాచ్‌కి బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, టెంపరేచర్ సెన్సింగ్ వంటి కొత్త హెల్త్ ట్రాకింగ్ ఫీచర్‌లను యాపిల్ నిరంతరం జోడిస్తోంది. ఈ క్రమంలో టెక్ దిగ్గజం రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేయడానికి ప్రత్యేక ఫీచర్‌, ECG సెన్సార్ కూడా తీసుకురావచ్చని అంటున్నారు.


కొత్త డిజైన్

ఆపిల్ టిప్‌స్టర్ మజిన్ ఇటీవల పోస్ట్ ప్రకారం టెక్ దిగ్గజం రాబోయే స్మార్ట్ వాచ్ రూపకల్పనలో మార్పులు చేయవచ్చని చెబుతున్నారు. సన్నని బెజెల్స్ కాకుండా ఆపిల్ వాచ్ అదనంగా స్టెయిన్‌లెస్ స్టీల్‌ను తీసివేసి, టైటానియంతో కూడిన గడియారాన్ని తీసుకురావచ్చని అంటున్నారు. అయితే Apple Watch Ultra 3 మాత్రం ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. దీంతోపాటు విభిన్న రంగుల డయల్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. సిరీస్ 10, అల్ట్రా 3 రెండింటిలోనూ డిస్‌ప్లేలు, మంచి ఫీచర్లు ఉంటాయని అంటున్నారు. యాపిల్ పేటెంట్ ఉల్లంఘన కారణంగా బ్లడ్ ఆక్సిజనేషన్ మానిటరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఆపిల్ వాచ్‌ను విక్రయించడాన్ని యుఎస్ నిషేధించింది. ఆ తర్వాత ఆపిల్ గుండె పర్యవేక్షణ కోసం సెన్సార్‌ను మెరుగుపరచడం వంటి ఫీచర్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Updated Date - Sep 07 , 2024 | 02:55 PM