Whatsapp: మరో ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. ఈసారి కెమెరా ఎఫెక్ట్‌లతోపాటు..
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:01 PM
వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫీచర్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. స్నాప్‌చాట్ మాదిరిగా కెమెరా ఎఫెక్ట్స్ వంటి అనేక ఎంపికలను పరీక్షిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(whatsapp) క్రమంగా స్నాప్‌చాట్‌గా మారబోతోందా. అంటే అవునని చెబుతున్నారు టెక్ వర్గాలు. ఎందుకంటే వాట్సాప్ గత కొన్ని నెలలుగా స్నాప్‌చాట్ మాదిరిగా ఉండే కొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇటివల కాలంలో స్నాప్‌చాట్ యూజర్ బేస్ కూడా పుంజుకుంది. దీంతో ఆ యాప్‌లోని ప్రధాన ఫీచర్లను వాట్సాప్‌లో కూడా ప్రవేశపెట్టాలని పరీక్షిస్తున్నారు. అందుకోసం వాట్సాప్‌లో కెమెరా ఎఫెక్ట్ ఫీచర్లను అందించడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అందుకోసం పరీక్ష కూడా కొనసాగుతోందని ఓ నివేదిక తెలిపింది.
కెమెరా ఎఫెక్ట్‌లు
నివేదిక ప్రకారం కొత్త అప్‌డేట్ తర్వాత వాట్సాప్‌లో చాలా కెమెరా ఎఫెక్ట్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇది కాకుండా అనేక ఫిల్టర్లు కూడా అందుబాటులో వస్తాయి. దీంతోపాటు వినియోగదారుల ముఖం, అనేక ఎంపికలు, ఫిల్టర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఫీచర్లన్నీ వీడియో కాలింగ్ సమయంలో అందుబాటులోకి వస్తుంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo రిపోర్ట్ ప్రకారం ఆండ్రాయిడ్ కోసం WhatsApp బీటా వెర్షన్ 2.24.22.10లో ఈ ఫీచర్ గుర్తించబడింది. ఇది ప్రస్తుతం ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
ఎలా పనిచేస్తుందంటే..
ఈ ఫీచర్ ట్రాకర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌ల ఆధారంగా యాప్ గోప్యతా సెట్టింగ్‌ల నుంచి ఈ కొత్త ఫీచర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. సెట్టింగ్‌లలో "కెమెరా ఫీచర్లను అనుమతించు" అనే కొత్త ఎంపిక కనిపిస్తుంది, దానిని ఆన్ లేదా ఆఫ్ చేయడం ద్వారా దీనిని పొందవచ్చు. ఈ ఫీచర్‌ను గోప్యతా సెట్టింగ్‌ల నుంచి నియంత్రించగలిగినప్పటికీ, ఇది నేరుగా కెమెరా స్క్రీన్, వీడియో కాల్ ఇంటర్‌ఫేస్ నుంచి యాక్టివేట్ చేయబడుతుంది. దీని వలన వినియోగదారులకు సులభంగా ఎఫెక్టుల యాక్సెస్ లభిస్తుంది. కెమెరా ఎఫెక్ట్‌లు ఎలాంటి ఎన్‌క్రిప్షన్ లేకుండా అందుబాటులోకి రానున్నాయి.
ఇంకొన్ని రోజుల్లో
ముఖ్యంగా వెర్షన్ 2.24.22.13లో కెమెరా ఎఫెక్ట్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు WhatsApp బీటా వినియోగదారులు యాప్ క్రాష్‌లను ఎదుర్కొన్నారు. ఫోటోలు లేదా వీడియోలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు అంతరాయం సమస్య ఏర్పడింది. తరచుగా ఎర్రర్ మెసేజ్‌లు, ఊహించని యాప్ షట్‌డౌన్‌కు దారి తీసింది. ఈ క్రమంలో కెమెరా ఎఫెక్ట్స్ క్రాష్‌ను పరిష్కరించడంతో పాటు WhatsApp కొత్త యూజర్ సెంట్రిక్ ఫీచర్‌లపై కూడా కంపెనీ చురుకుగా పని చేస్తోంది. దీంతో మరికొన్ని రోజుల్లో మరింత ఆకర్షణీయంగా ఈ ఫీచర్ అందరికీ అమల్లోకి రానుంది.
ఇవి కూడా చదవండి:
Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...
WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..
Gmail Scam: జీమెయిల్ ఖాతా రికవరీ చేస్తామంటూ కేటుగాళ్ల స్కాం
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..
For More Technology News and Telugu News