Share News

Recharge Plans: జియోలో తక్కువ ధరతో ఎక్కువ లాభాలున్న ప్లాన్ ఇదే

ABN , Publish Date - Aug 03 , 2024 | 07:47 PM

దేశ వ్యాప్తంగా దాదాపు 48 కోట్ల మంది వినియోగదారులతో జియో నంబర్ 1 టెలికాం సంస్థగా ఉంది. అయితే ఇటీవల రిలయన్స్ జియో టారిఫ్ ఛార్జీలను పెంచింది. దీంతో అన్ని రీచార్జ్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలను భరించలేక వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Recharge Plans: జియోలో తక్కువ ధరతో ఎక్కువ లాభాలున్న ప్లాన్ ఇదే

ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా దాదాపు 48 కోట్ల మంది వినియోగదారులతో జియో నంబర్ 1 టెలికాం సంస్థగా ఉంది. అయితే ఇటీవల రిలయన్స్ జియో టారిఫ్ ఛార్జీలను పెంచింది. దీంతో అన్ని రీచార్జ్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలను భరించలేక వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ టెల్, ఐడియా కూడా జియో బాటలో నడవడంతో వేల సంఖ్యలో యూజర్లు బీఎస్ఎన్‌ఎల్‌కి పోర్ట్ అయ్యారు. అయితే జియోలోనే కొనసాగుతున్న కోట్ల మంది వినియోగదారులు తక్కువ రీచార్జ్‌తో ఎక్కువ లాభాలు పొందాలని చూస్తున్నారు. అలాంటివారి కోసమే ఈ వార్త. ఈ రీచార్జ్ ప్లాన్‌తో వినియోగదారులకు రోజుకి 2 జీబీ డేటా చొప్పున వస్తుంది.


రూ. 349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

జియో రూ.349 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. తక్కువ వ్యవధిలో ఎక్కువ డేటా ప్రయోజనాలను కోరుకునే వారికి ఈ ప్లాన్ అనువైనది. 28 రోజుల చెల్లుబాటు వ్యవధితో వినియోగదారులు ఎలాంటి పరిమితులు లేకుండా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్‌లు చేయవచ్చు. మొత్తంగా 28 రోజుల వ్యవధికిగానూ 56 జీబీ డేటాను అందుకుంటారు. అంటే రోజుకి 2 జీబీ డేటాచొప్పున అన్నమాట. ముఖ్యంగా ఈ ప్లాన్ అపరిమిత 5జీ డేటాకు యాక్సెస్‌ను అందిస్తుంది. 5జీ డేటా అందుబాటులో ఉండే వినియోగదారులు యాక్సెస్ చేసుకోవచ్చు. వీటితోపాటు జియో టీవీ, జియో క్లౌడ్‌కి ఉచిత యాక్సెస్‌తో పాటు, OTT స్ట్రీమింగ్ కోసం జియో సినిమాకి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

బీఎస్ఎన్ఎల్ 5జీ ట్రయల్స్..

ఓ వైపు ప్రధాన టెలికాం నెట్‌వర్క్‌లు టారిఫ్ ఛార్జీలు పెంచడంతో పలువురు వినియోగదారులు బీఎస్‌ఎన్ఎల్‌కి పోర్ట్ అయ్యారు. అయితే భారత్‌లో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవల కోసం ట్రయల్స్‌ని ప్రారంభించారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. ట్రయల్స్‌కి సంబంధించిన ప్రదర్శనల వీడియోను ఇటీవల ఎక్స్‌లో షేర్ చేశారు.


మీ దగ్గర్లోని బీఎస్ఎన్ఎల్ టవర్‌ తెలుసుకోండిలా..

Step 1: ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Step 2: కిందకి స్క్రోల్ చేసి, 'మై లొకేషన్'పై క్లిక్ చేయండి

Step 3: తదుపరి స్క్రీన్‌లో మీ పేరు, ఇమెయిల్, మొబైల్ నంబర్, క్యాప్చా నమోదు చేయండి

Step 4: ‘Send me a mail with OTP’పై క్లిక్ చేయండి

Step 5: OTPని ఎంటర్ చేయండి.

Step 6: తదుపరి స్క్రీన్‌లో మీకు సమీపంలో ఉన్న అన్ని సెల్ ఫోన్ టవర్‌లతో కూడిన మ్యాప్ కనిపిస్తుంది.

Step 7: సిగ్నల్ రకం (2G/3G/4G లేదా 5G), ఆపరేటర్ సమాచారాన్ని పొందడానికి ఏదైనా టవర్‌పై క్లిక్ చేయండి.

Updated Date - Aug 03 , 2024 | 07:47 PM