New Updates: కొత్త సిమ్ కొంటున్నారా.. రూల్స్ మారాయ్, గమనించగలరు
ABN , Publish Date - Sep 15 , 2024 | 06:11 PM
Airtel, Reliance Jio, BSNL, Vodafone-Idea (Vi) వంటి ప్రముఖ టెలికాం ప్రొవైడర్లు సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసే ప్రక్రియ సులభంగా, సురక్షితంగా చేయడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) గణనీయమైన మార్పులను చేపట్టింది.
వెబ్ డెస్క్: జియో, ఎయిర్‌టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రముఖ టెలికాం ప్రొవైడర్లు సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసే ప్రక్రియను సులభంగా, సురక్షితంగా చేయడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) గణనీయమైన మార్పులను చేపట్టింది. కొత్త నిబంధనలతో సిమ్ కార్డుల కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పేపర్‌లెస్‌గా మారనుంది. వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మోసాలు తగ్గించే విధంగా నిబంధనలు మార్చారు.
అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు..
కొత్త నిబంధనలతో వినియోగదారులు సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేయడానికి టెలికాం కంపెనీ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు. ఇకపై సిమ్ కొనుగోలు ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌లో ఉంటుంది. కాబట్టి, మీరు కొత్త SIM కార్డ్‌ని కొనాలని లేదా మీ సిమ్‌ను పోర్ట్ చేయాలని చూస్తుంటే.. ఫోటోలు, లైవ్ డాక్యుమెంట్లను సమర్పించాల్సిన పనిలేదు. అన్నీ ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు.
టెలికమ్యూనికేషన్స్ విభాగం ప్రకటన..
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తన అధికారిక X హ్యాండిల్‌లో మారిన నిబంధనలను పోస్ట్ రూపంలో షేర్ చేసింది. డిజిటల్ ఇండియా స్ఫూర్తికి అనుగుణంగా పేపర్‌లెస్ సిమ్ కొనుగోలు ప్రక్రియ ఇకపై అందుబాటులో ఉంటుందని తెలిపింది. వినియోగదారుల భద్రతే తమ తొలి ప్రాధాన్యం అని తెలిపింది.
ఈ కేవైసీ..
DoT ప్రవేశపెట్టిన ప్రధాన సంస్కరణల్లో ప్రధానమైనవి e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్), స్వీయ కేవైసీ అమలు. తాజా మార్పులతో వినియోగదారులు ఏ టెలికాం ఆపరేటర్ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా ఈ కేవైసీ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఆధార్ ఆధారిత ఈ కేవైసీ..
DoT తన సంస్కరణల్లో ఆధార్ ఆధారిత e-KYC, సెల్ఫ్ KYC, OTP ఆధారిత సర్వీస్ స్విచ్‌లను ఇంటిగ్రేట్ చేసింది.
ఆధార్ కార్డుతో..
డిజిటల్ ధృవీకరణ కోసం వినియోగదారులు తమ ఆధార్ కార్డును మాత్రమే ఉపయోగించి సిమ్‌ను కొనుగోలు చేయాలి. రూ.1తో టెలికాం ఆపరేటర్‌లు మీ ఆధార్ వివరాలను పేపర్‌లెస్ ప్రక్రియ ద్వారా ధ్రువీకరిస్తారు.
డిజిలాకర్ సాయంతో డాక్యుమెంట్ల ధ్రువీకరణ ఆన్‌లైన్‌లో అయిపోతుంది.
ఈ స్వీయ-ధృవీకరణ ప్రక్రియ కస్టమర్‌లు కొత్త సిమ్‌ని కొనుగోలు చేస్తున్నప్పుడు లేదా ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు మారుతున్నప్పుడు (Vice Versa) వారి KYC ప్రాసెస్‌ను స్వతంత్రంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.
ఓటీపీ ఆధారిత సర్వీస్ స్విచ్
ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సేవల మధ్య మారడానికి ఇకపై టెలికాం ఆపరేటర్ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు.
OTP ద్వారా మీ గుర్తింపును ధృవీకరిస్తే సరిపోతుంది.