Share News

Smart Phone: తల్లిదండ్రులకు అలర్ట్.. మీ పిల్లల ఫోన్‌లో వెంటనే ఈ పని చేయండి..!

ABN , Publish Date - Jul 31 , 2024 | 09:39 PM

Tech News: ప్రస్తుతం కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఉంది. కొందరైతే రెండేసే ఫోన్లను కూడా వినియోగిస్తుంటారు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వ్యక్తిగత పనులు మొదలు..

Smart Phone: తల్లిదండ్రులకు అలర్ట్.. మీ పిల్లల ఫోన్‌లో వెంటనే ఈ పని చేయండి..!
Smart Phone Using Tips

Tech News: ప్రస్తుతం కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఉంది. కొందరైతే రెండేసే ఫోన్లను కూడా వినియోగిస్తుంటారు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వ్యక్తిగత పనులు మొదలు.. వృత్తిపరమైన పనులు సైతం జస్ట్ ఫోన్‌తోనే పూర్తి చేసే సదుపాయం ప్రస్తుతం ఉంది. అందుకే.. ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంది. స్కూల్ వెళ్లే విద్యార్థులు మొదలు.. ఉద్యోగాలు చేసే ఎంప్లాయిస్.. విశ్రాంతిలో ఉన్న వృద్ధులు సైతం మొబైల్ ఫోన్‌తో తమ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు.


అయితే, ఇటీవలి కాలంలో పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. ఎడ్యూకేషన్ కారణంగా.. ఫోన్ వినియోగం ఎక్కువైంది. అయితే, ఇక్కడే పెద్ద సమస్య ఎదురవుతుంది. పిల్లలు ఫోన్‌లో ఇంటెర్నెట్ యాక్సెస్ కారణంగా ఎక్కువగా కార్టూన్స్ చూడటం, గేమ్స్ ఆడటం చేస్తున్నారు. వీటికి అడిక్ట్ అయిపోయి చదువును సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో పిల్లలను ఫోన్ వినియోగించకుండా కంట్రోల్ చేయడం తలకు మించిన భారంగా మారుతోంది.


పిల్లలు తమ చదువు కోసం స్మార్ట్ ఫోన్లను వాడటం మంచిదే. చెడు మార్గంలో పయనిస్తే అసలు సమస్యలు మొదలవుతాయి. స్మార్ట్ ఫోన్ పిల్లలకు ఎంత ఉపయోగకరమో.. అంతకు మించి హానీకరం కూడా. స్మార్ట్ ఫోన్‌కు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. దీంతో పిల్లలు అడల్ట్ కంటెంట్ చూసే అవకాశం ఉంటుంది. అందుకే.. పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మీ పిల్లలు ఎలాంటి తప్పుడు మార్గం పట్టకుండా చూసుకోవచ్చు. పిల్లలు.. అడల్ట్ కంటెంట్ చూడకుండా స్మార్ట్ ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేయొచ్చు. తద్వారా వారు ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా నివారించొచ్చు. మరి పిల్లలు తమ ఫోన్‌లలో అడల్ట్ కంటెంట్ చూడకుండా ఏం చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ సూచనలు ఫాలో అవ్వండి..

1. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో Google Play స్టోర్‌ని ఓపెన్ చేయాలి.

2. హోమ్‌స్క్రీన్‌పై ఉన్న మీ ప్రొఫైల్ పిక్‌పై క్లిక్ చేయాలి.

3. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

4. ఆ తర్వాత ఫ్యామిలీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

5. ఇప్పుడు పేరెంటల్ కంట్రోల్స్ ఆప్షన్‌ని ఆన్ చేయాలి.

6. ఇక్కడ పిన్ సెట్ చేయమని అడుగుతుంది. ఆ పిన్‌ను సెట్ చేయాలి.

7. ఇలా మీ పిల్లల ఫోన్ నుంచి అడల్ట్ కంటెంట్‌ను కంట్రోల్ చేయొచ్చు.


Also Read:

కోచింగ్ సెంటర్ల రెగ్యులేషన్‌కు ఎల్జీ కమిటీ

బీజేడీ ఎంపీ రాజీనామా.. బీజేపీలో చేరే అవకాశం

ఇదెక్కడి విడ్డూరం.. 70 ఏళ్ల మామను పెళ్లి చేసుకున్న

For More Technology News and Telugu News..

Updated Date - Jul 31 , 2024 | 09:39 PM