Apple: నేడు ఆపిల్ లాంచ్ ఈవెంట్.. కీలక ఫోన్లతోపాటు పలు ఉత్పత్తులు లాంచ్
ABN , Publish Date - Sep 09 , 2024 | 12:39 PM
మీరు టెక్ ప్రియులా అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే నేడు ఆపిల్ నుంచి పలు ఉత్పత్తులను లాంచ్ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం నేడు (సెప్టెంబర్ 9న) రాత్రి 10:30 నుంచి ఇట్స్ గ్లోటైమ్ ఈవెంట్ ప్రారంభమవుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ఆపిల్ పార్క్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
నేడు మరికొన్ని గంటల్లో Apple 'It's Glowtime' ఈవెంట్ అగ్రరాజ్యం అమెరికా(america)లో మొదలు కానుంది. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9న రాత్రి 10:30 నుంచి ప్రారంభమవుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ఆపిల్ పార్క్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. లాంచ్ ఈవెంట్ Apple అధికారిక YouTube ఛానెల్, కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దీంతో ఈ కార్యక్రమం కోసం అనేక మంది టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆండ్రాయిడ్‌లో నోటిఫికేషన్ ఎఫెక్ట్ మాదిరిగానే ఐఫోన్‌లలో సిరిని యాక్టివేట్ చేసినప్పుడు వచ్చే ప్రత్యేక గ్లో ఎఫెక్ట్‌ను సూచిస్తూ ఈవెంట్‌కు "ఇట్స్ గ్లోటైమ్" అని పేరు పెట్టారు.
వీటిపైనే ఫోకస్
ఈ ఈవెంట్‌లో ఆపిల్ నాలుగు కొత్త ఐఫోన్‌లను ప్రకటించవచ్చు. వీటిలో iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max ఉన్నాయి. ఐఫోన్‌లతో పాటు ఈవెంట్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఇయిర్‌పాడ్స్ 4లను కూడా ఆపిల్ విడుదల చేయనుంది. అయితే ఈవెంట్‌లో అనేక మంది దృష్టి ఐఫోన్‌లు, ఆపిల్ ఇంటెలిజెన్స్‌పైనే ఉంది. కొత్త iPhone 16 సిరీస్ ఇప్పటికే ఉన్న iPhone 15 Pro, iPhone 15 Pro Max వంటి మోడళ్లతో ఐప్యాడ్‌లు, Macలలో Apple ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉచితంగా లభిస్తుందని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో యాపిల్ ఇంటెలిజెన్స్‌ను ప్రవేశపెట్టడంతోపాటు ఆపిల్ సిరిలో మార్పులు చేసింది. AIతో కూడిన సిరి మరింత సహజంగా, సులభతరంగా ఉంటుందని ఆపిల్ తెలిపింది. అయితే ఐఫోన్ 16 మోడల్స్ మెడిన్ ఇండియా కావడం విశేషం.
ఐఫోన్ 16 సిరీస్‌లో ప్రత్యేకత ఏమిటి?
Apple iPhone 16 లైనప్‌లో 4 మోడళ్లను కూడా పరిచయం చేయబోతోంది. ఈసారి ఈ పరికరాలు కొత్త A18 ప్రో చిప్‌సెట్‌తో అమర్చబడి ఉంటాయి. ఇవి అధిక పనితీరును కనబరుస్తాయి. అయితే ప్రతి మోడల్‌లో ఏదో ఒక ప్రత్యేకతను అందించబోతోంది. సాధారణ ఐఫోన్ 16 ఐఫోన్ 11 వంటి డిజైన్‌కు తిరిగి వస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే కెమెరా సిస్టమ్ ఐఫోన్ 15 లాగా అనిపిస్తుంది. 2x ఆప్టికల్ జూమ్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో రానున్నట్లు తెలుస్తోంది.
ఐఫోన్ 16 ప్లస్
ఐఫోన్ 16 ప్లస్ పెద్ద స్క్రీన్‌ను ఇష్టపడే వ్యక్తుల కోసం రూపొందించబడింది. స్ట్రీమింగ్, గేమింగ్ కోసం ఇది సరైనది. ఇది సాధారణ మోడల్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో కెమెరా సిస్టమ్ కూడా ఉంది. ఈసారి కంపెనీ బ్యాటరీ సామర్థ్యాన్ని తగ్గించింది. నివేదికల ప్రకారం బ్యాటరీ దాదాపు 9 శాతం తగ్గిపోతుందని భావిస్తున్నారు.
లైనప్‌లో మార్పులు
ఐఫోన్ 16 ప్రో ప్రో మాక్స్ లైనప్‌లో అత్యంత ప్రత్యేక ఫీచర్లను చూడవచ్చు. ఇందులో ప్రధాన కెమెరా అప్‌గ్రేడ్ ఉంటుంది. అల్ట్రా-వైడ్ లెన్స్ 12-మెగాపిక్సెల్ నుంచి 48-మెగాపిక్సెల్ వరకు పెంచుతారు. ఇది మంచి ఫోటో నాణ్యతను అందిస్తుంది. ఇది కాకుండా బ్యాటరీ లైఫ్‌లో చాలా మెరుగుదల ఉంటుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా వినియోగదారులు ఈ ఫోన్‌ను ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు.
ఇవి కూడా చదవండి:
Money Saving Plan: రిటైర్ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..
Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది.. క్షీణిస్తుందా, పెరుగుతుందా..
BSNL: జియో, ఎయిర్‌టెల్ కట్టడికి బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్లాన్.. టాటా సపోర్ట్‌తో ఇక..
Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..
For MoreTechnology NewsandTelugu News..