Share News

WhatsApp: వాట్సాప్‌ నుంచి మరో రెండు అద్భుతమైన ఫీచర్‌లు

ABN , Publish Date - Jul 03 , 2024 | 12:26 PM

ప్రస్తుతం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్(WhatsApp) వాడకం సర్వసాధారణమైపోయింది. ప్రజలు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఎవరితోనైనా సులభంగా ఇంటరాక్ట్ చేయవచ్చు. ఈ క్రమంలోనే పలు ఫీచర్లపై(features) వాట్సాప్ ఎప్పటికప్పుడు పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో యూజర్లకు మరో రెండు అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

WhatsApp: వాట్సాప్‌ నుంచి మరో రెండు అద్భుతమైన ఫీచర్‌లు
WhatsApp features update

ప్రస్తుతం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్(WhatsApp) వాడకం సర్వసాధారణమైపోయింది. ప్రజలు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఎవరితోనైనా సులభంగా ఇంటరాక్ట్ చేయవచ్చు. ఈ క్రమంలోనే పలు ఫీచర్లపై(features) వాట్సాప్ ఎప్పటికప్పుడు పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో యూజర్లకు మరో రెండు అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. అవే వాట్సాప్ వాయిస్ నోట్, వీడియో నోట్ ఫీచర్స్. ఇవి వచ్చిన తర్వాత వినియోగదారులు ఈ యాప్‌ను మరింత సౌకర్య వంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ల ద్వారా తక్షణమే వ్యక్తులు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇవి మరింత ఉపయోగపడతాయని టెక్ వర్గాలు అంటున్నాయి.


వాయిస్ నోట్

కొత్త వాయిస్ నోట్(Voice note) ఫీచర్‌తో వాట్సాప్ యూజర్లు నేరుగా చాట్ విండో ద్వారా తమ కాంటాక్ట్‌లకు వాయిస్ నోట్స్‌ను పంపుకోవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉన్న వాయిస్ నోట్ ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా సంబంధిత వ్యక్తులతో సులభంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు.


వీడియో నోట్

వాయిస్ నోట్స్‌తో పాటు వీడియో నోట్స్‌(video notes)ను పంపే సదుపాయాన్ని కూడా వాట్సాప్ అందుబాటులోకి తెస్తుంది. WABetaInfo ప్రకారం ఈ ఫీచర్ Android వెర్షన్ 2.24.14.14లో అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. మరికొన్ని రోజుల్లో అందరికీ అందుబాటులోకి రానుంది. వీడియో నోట్ ఫీచర్ ద్వారా వినియోగదారులు చిన్న చిన్న వీడియో సందేశాలను పంపించుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు ఫోటోలు, వీడియోలను షేర్ చేయడానికి ఇప్పటికే అవకాశం ఉంది.

ఈ ఫీచర్ల(features) ద్వారా డైరెక్టుగా వినియోగదారులు ఆడియో, వీడియో సందేశాలను సులభంగా పంపించుకోవచ్చు. అంతేకాదు వీడియో ద్వారా కమ్యూనికేట్ చేసుకునే వినియోగదారులకు కొత్త ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత వీడియో నోట్స్‌ని గ్రూప్‌లు, కాంటాక్ట్‌లకు ఫార్వార్డ్ చేసుకోవచ్చని అన్నారు.


ఇవి కూడా చదవండి:

YouTube: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. మీ వాయిస్, ఫేస్ ఉపయోగించి రూపొందించే ఏఐ వీడియోలపై ఫిర్యాదు చేయవచ్చు..


WhatsApp: వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్ AIని ఇలా ఉపయోగించండి.. అవి మాత్రం అడగొద్దు


Read Latest Technology News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 12:30 PM