Share News

Whatsapp: వాట్సాప్ నుంచి మరో ఫీచర్.. ఇకపై టైప్ చేయాల్సిన పనిలే..

ABN , Publish Date - Jun 15 , 2024 | 02:28 PM

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్‌(whatsapp)ను విరివిగా ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. దీంతో ఈ యాప్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.4 బిలియన్ల మందికిపైగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.

Whatsapp: వాట్సాప్ నుంచి మరో ఫీచర్.. ఇకపై టైప్ చేయాల్సిన పనిలే..
whatsapp voice note feature

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్‌(whatsapp)ను విరివిగా ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. దీంతో ఈ యాప్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.4 బిలియన్ల మందికిపైగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తూ సరికొత్త అనుభూతిని అందించేందుకు కంపెనీ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది.


ఈ క్రమంలోనే వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ మెసేజింగ్(messaging) అనుభవం పూర్తిగా మారభోతుంది. ఆ ఫీచర్ ఏంటంటే వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ మెసేజ్‌లుగా మార్చుకోగలిగే ఫీచర్. Wabeta సమాచారం ప్రకారం త్వరలో వినియోగదారులు WhatsAppలో వాయిస్ నోట్‌లను టెక్స్ట్ మెసేజ్‌లుగా పొందవచ్చు. ఈ ఫీచర్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఇంటర్వ్యూ లేదా వాయిస్ కామెంట్‌ని వినియోగదారులు మరోక యాప్ అవసరం లేకుండా సులభంగా టెక్స్ట్ మెసేజ్‌లుగా పంపించుకోవచ్చు.


WhatsAppinfo ప్రకారం WhatsApp కొత్త ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. ఇప్పటికే వాయిస్ నోట్‌లను టెక్స్ట్‌కి మార్చడానికి ఈ ఫీచర్‌పై పని చేస్తున్నారు. అయితే ఇది త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ విభాగంలో వినియోగదారులు స్పానిష్, పోర్చుగీస్, ఇంగ్లీష్, రష్యన్, హిందీతో సహా అనేక భాషల ఎంపికను పొందుతారు. భవిష్యత్తులో ఈ ఫీచర్‌ని మరిన్ని భాషలను కూడా జోడించవచ్చని తెలుస్తోంది. వాట్సాప్ ఈ ఫీచర్‌ను మొదట ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే విడుదల చేస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.


ఇది కూడా చదవండి:

T20 World Cup 2024: నేడు టీమిండియా Vs కెనడా మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్, పిచ్ ఎలా ఉందంటే..

Mobiles: ఫోన్ల వెనక వాలెట్లు ఉంచుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా


Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి

Read Latest Technology News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 02:32 PM