AV Ranganath: చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Nov 19 , 2024 | 10:23 AM
సహజవనరులను ప్రజలకు ఉపయోగపడే విధం గా చెరువులను సుందరీకరించడం ప్రస్తుతం అవసరమని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) అన్నారు. ఇటీవల గ్రేటర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చెరువుల సుందరీకరణ అంశంపై ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, కార్పొరేటర్లు మంజుల రఘునాధ్‌రెడ్డి అధికారులు చందానగర్(Chandanagar) సర్కిల్ పరిధిలోని బచ్చెకుంట, రేగుల కుంట చెరువుల సుందీకరణ పనులు చేపట్టాలని కోరారు.
- హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్: సహజవనరులను ప్రజలకు ఉపయోగపడే విధం గా చెరువులను సుందరీకరించడం ప్రస్తుతం అవసరమని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) అన్నారు. ఇటీవల గ్రేటర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చెరువుల సుందరీకరణ అంశంపై ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, కార్పొరేటర్లు మంజుల రఘునాధ్‌రెడ్డి అధికారులు చందానగర్(Chandanagar) సర్కిల్ పరిధిలోని బచ్చెకుంట, రేగుల కుంట చెరువుల సుందీకరణ పనులు చేపట్టాలని కోరారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ ఏరియాల్లో 11 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు విద్యుత్ సరఫరా బంద్
ఈ మేరకు రంగనాథ్ సోమవారం అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల సుందరీకరణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, కార్పొరేటర్ల సహాయ సహకారాలతో బై రెడ్డి ఫౌండేషన్ సహకారంతో సుందరీకరణ పనులు చేపట్టి, పూర్తి చేయడం హర్షనీయమన్నారు. గ్రేటర్ పరిధిలోని అన్ని చెరువులను సుందరీకరణ పనులు చేపడితే ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందన్నారు.
సీనియర్ కాంగ్రెన్ నాయకులు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో మొట్టమొదటి స రిగా చెరువుల సుందరీకరణ పనులను స్వచ్ఛంద సంస్థల సహకారంతో పనులను చేపట్టిన ఘనత ఎమ్మెల్యే గాంధీకి దక్కిందన్నారు. మరిన్ని చెరువుల అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. బచ్చుకుంట చెరువు సుందరీకరణతో పరిసర ప్రాంతకాలనీ ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్ పరిస్థితే లగచర్లలోనూ..
ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్ హయాంలో సర్వేతో దోపిడీ
ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్ ప్రవర్తన
Read Latest Telangana News and National News