Balka Suman: తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఉరుకోం: బాల్క సుమన్
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:38 PM
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు(CM Chandrababu), రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన పదేళ్ల తర్వాత తెలంగాణపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు మొదలుపెట్టారని ఆరోపించారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు(CM Chandrababu), రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన పదేళ్ల తర్వాత తెలంగాణపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు మొదలుపెట్టారని ఆరోపించారు.
రిటైర్డు ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఆదిత్యనాథ్ దాస్‌ను తెలంగాణ నీటిపారుదల, జల వనరుల శాఖ సలహాదారుగా నియమించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నియామకం వెనక దాగి ఉన్న రహస్యం ఏంటో చెప్పాలని, వెంటనే పదవి నుంచి ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి నడుస్తున్నారంటూ బాల్క సుమన్ మండిపడ్డారు. విభజన సమయంలో ఏపీలో కలిపిన ఏడు మండలాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇంతవరకూ ఒక్క మాటా మాట్లాడలేదన్నారు. భద్రాచలం రూరల్ మండలం యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు పంచాయతీలను రాష్ట్రంలో కలిపేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు ఎవరు విఘాతం కలిగించినా చూస్తూ ఊరుకోమంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలను ఉద్దేశిస్తూ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
TG News: విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయి: కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్
Jagadish Reddy: కమిషన్ల పేరుతో ప్రజల దృష్టి మరలిస్తున్నారు: మాజీమంత్రి జగదీశ్ రెడ్డి