Share News

Rajaram Yadav: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ కేటాయించాలి

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:39 AM

రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు అమలు చేసేలా బీసీలంతా ఐక్య పోరాటాలు చేయాలని పలు పార్టీల నేతలు, సంస్థల నాయకులు పిలుపునిచ్చారు.

Rajaram Yadav: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ కేటాయించాలి

  • దీక్షలో మాట్లాడుతున్న బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్‌

  • సత్యాగ్రహ దీక్షలో బీసీ సంఘాల నేతల డిమాండ్‌

కవాడిగూడ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు అమలు చేసేలా బీసీలంతా ఐక్య పోరాటాలు చేయాలని పలు పార్టీల నేతలు, సంస్థల నాయకులు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం ధర్నా చౌక్‌ దగ్గర బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్‌ అధ్యక్షతన, బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీల సత్యాగ్రహ దీక్ష జరిగింది.


దీక్షలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, జాజుల శ్రీనివా్‌సగౌడ్‌, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న తదితరులు పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు అమలు చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ.. బీసీల డిమాండ్ల సాధన కోసం అవసరమైతే తన ఎమ్మెల్సీ పదవిని వదులుకుంటానని చెప్పారు.


ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు. రాజారాంయాదవ్‌ మాట్లాడుతూ.. బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయకుండా ప్రభుత్వం బీసీలను మోసం చేయడానికి సిద్ధపడిందన్నారు. బీసీ కులగణన చేపట్టకపోతే లక్షల మందితో హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని జాజుల హెచ్చరించారు.

Updated Date - Aug 11 , 2024 | 04:39 AM