Share News

Lok Sabha polls 2024: ముస్లిం మహిళా ఓటర్ల ఐడీలను తనిఖీ చేసిన మాధవీ లత..

ABN , Publish Date - May 13 , 2024 | 02:18 PM

హైదరాబాద్: నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత తన నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌‌లో ఓటింగ్ సరళని పరిశీలించారు. బూత్‌లో కూర్చున్న ముస్లిం ఓటర్ల బురఖాలను తొలగించమని కోరి ఓటర్ ఐడీల వెరిఫికేషన్ చేశారు.

Lok Sabha polls 2024: ముస్లిం మహిళా ఓటర్ల ఐడీలను తనిఖీ చేసిన మాధవీ లత..

హైదరాబాద్: నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) భాగంగా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత (Madhavi Latha) తన నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌‌లో ఓటింగ్ సరళని పరిశీలించారు. బూత్‌లో కూర్చున్న ముస్లిం ఓటర్ల బురఖాలను తొలగించమని కోరి ఓటర్ ఐడీల వెరిఫికేషన్ చేశారు. అజాంపూర్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 122లో ఈ వెరిఫికేషన్ చేశారు.


రిక్వెస్ట్‌తోనే వెరిఫికేషన్..

కాగా, ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం బురఖాలు తొలగించాలని మహిళలను కోరానని, అందులో తప్పేమీ లేదని మాధవీ లత వివరణ ఇచ్చారు. "నేను అభ్యర్థిని. చట్టం ప్రకారం ఫేస్‌మాస్క్‌లు లేకుండా ఐడీ కార్డుల వెరిఫికేషన్ చేసే హక్కు అభ్యర్థులకు ఉంటుంది. నేను కూడా మహిళనే, మహిళలంటే నాకెంతో గౌరవం ఉంది. ఐడీ కార్డుల వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నట్టు వారిని అభ్యర్థించాను. ఎవరైనా దీనిని ఒక సమస్యగా చూస్తే వారు భయపడుతున్నట్టుగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది'' అని మాధవీలత తెలిపారు.

Lok Sabha polls 2024: ఓటు వేసిన బండారు దత్తాత్రేయ


కాగా, దీనికి ముందు తన నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో తేడాలు ఉన్నట్టు మాధవీ లత ఆరోపించారు. పోలీసు సిబ్బంది డల్‌గా కనిపిస్తున్నారని, చురుకుగా లేరని చెప్పారు. ఎవరినీ తనిఖీలు చేయడం లేదన్నారు. ఇక్కడకు వచ్చిన సీనియర్ సిటిజన్ల పేర్లు ఓటర్ లిస్టులో లేవని చెప్పారు. వీరిలో కొందరు గోషామహల్‌లో ఉంటున్నారనీ, కానీ వాళ్ల పేర్లు రంగారెడ్డి లిస్ట్‌లో ఉన్నాయని చెప్పారు. కాగా, మాధవీలతపై ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2024 | 02:18 PM