Share News

Gulf workers: జీవో 205 పరిధి విస్తరించేలా కృషి చేయండి

ABN , Publish Date - Sep 20 , 2024 | 05:03 AM

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు సమగ్ర ఎన్‌ఆర్‌ఐ పాలసీకి చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక విజ్ఞప్తి చేసింది.

Gulf workers: జీవో 205 పరిధి విస్తరించేలా కృషి చేయండి

  • గవర్నర్‌కు ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక విజ్ఞప్తి

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు సమగ్ర ఎన్‌ఆర్‌ఐ పాలసీకి చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కోటపాటి నరసింహం నాయుడు బృందం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిసి వినతిపత్రం అందజేసింది. తెలంగాణ నుంచి లక్షల మంది కార్మికులు 18 ఈసీఆర్‌ దేశాలకు, కాంబోడియా, రష్యాకు వెళ్తున్నారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం 7 దేశాలకు వెళ్లే వారికి మాత్రమే వర్తించే విధంగా జీవో నంబరు 205 జారీ చేసిందని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు.


యూఏఈ, బెహ్రయిన్‌, ఖతార్‌, ఓమన్‌, కువైట్‌, సౌదీ, ఇరాక్‌ దేశాల్లో కార్మికులుగా వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోతే ఇచ్చే రూ.5లక్షల పరిహారాన్ని మిగతా ఈసీఆర్‌ దేశాలకు కూడా వర్తించేలా జీవో 205 పరిధిని విస్తరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

Updated Date - Sep 20 , 2024 | 05:03 AM