Share News

IPS Officers Transfer: మరికొంతమంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ ఆదేశాలు..

ABN , Publish Date - Jul 01 , 2024 | 04:54 PM

తెలంగాణ రాష్ట్రంలో 8మంది ఐపీఎస్‌లను బదిలీ(IPS Officers Transfer) చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఐపీఎస్‌ల బదిలీలు జరగగా.. తాజా మరికొంత మందిని ట్రాన్స్‌ఫర్ చేశారు.

IPS Officers Transfer: మరికొంతమంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ ఆదేశాలు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 8మంది ఐపీఎస్‌లను బదిలీ (IPS Officers Transfer) చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanti Kumari) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఐపీఎస్‌ల బదిలీలు జరగగా.. తాజా మరికొంత మందిని ట్రాన్స్‌ఫర్ చేశారు. కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోశ్ పంకజ్, ములుగు ఓఎస్‌డీగా గీతే మహేశ్ బాబా సాహెబ్, గవర్నర్ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్ నియమితులయ్యారు.

సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా కాంతిలాల్ సుభాశ్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయ, భైంసా ఏఎస్పీగా అవినాశ్ కుమార్‌ను నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. గత నెలలోనూ పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు, పలుజోన్లకు డీసీపీలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Jul 01 , 2024 | 05:02 PM