Share News

Maoist encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి..

ABN , Publish Date - Jul 26 , 2024 | 06:21 AM

ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో.. తెలంగాణకు చెందిన ఓ నక్సలైట్‌ మృతిచెందారు.

Maoist encounter: ఎన్‌కౌంటర్‌లో  మావోయిస్టు మృతి..

  • ములుగు, కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌ భూపాలపల్లి జిల్లా వాసి

  • అశోక్‌గా గుర్తింపుతండ్రి సంవత్సరీకం రోజునే ఘటన

  • 8భూపాలపల్లి జిల్లా వాసి అశోక్‌గా గుర్తింపు

గణపురం/ములుగు, జూలై 25: ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో.. తెలంగాణకు చెందిన ఓ నక్సలైట్‌ మృతిచెందారు. మావోయిస్టు పార్టీ ప్లీనరీ జరుగుతోందనే సమాచారంతో స్పెషల్‌ పార్టీ పోలీసులు గురువారం తెల్లవారుజాము నుంచి ఈ రెండు జిల్లాల సరిహద్దుల్లోని గుండాల మండలం దామరతోగు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం 6 గంటలకు మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


తదుపరి దర్యాప్తులో మృతుడిని జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన విజేందర్‌ అలియాస్‌ నల్లమరి అశోక్‌(40)గా గుర్తించారు. కాకతాళీయంగా అశోక్‌ తన తండ్రి సంవత్సరీకం రోజునే చనిపోయారని గ్రామస్తులు కన్నీటిపర్యంతం చెప్పారు. అశోక్‌పై రూ.లక్ష రివార్డు ఉంది. మరోవైపు.. ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని, ఈ ఎన్‌కౌంటర్‌ను విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని మావోయిస్టు పార్టీ భద్రాద్రి-కొత్తగూడెం - అల్లూరి సీతారామరాజు డివిజన్‌ కార్యదర్శి ఆజాద్‌ కోరారు. ఈ మేరకు ఆయన పేరిట ఓ లేఖ విడుదలైంది. ఈ ఎన్‌కౌంటర్‌కు రేవంత్‌ సర్కారు తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. కాగా.. ఛత్తీ్‌సగఢ్‌లోని గంగలూరులో గురువారం నలుగురు మావోయిస్టులు అరెస్టవ్వగా.. సుకుమాలో మరో ఐదుగురు పోలీసులకు లొంగిపోయారని పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 26 , 2024 | 06:21 AM