Hyderabad: కవిత అప్రూవర్‌గా మారతారు..?
ABN , Publish Date - Jun 30 , 2024 | 03:21 AM
లిక్కర్ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అప్రూవర్‌గా మారబోతున్నట్లు తెలుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు. అందుకే కేటీఆర్, హరీశ్‌రావులు తిహాడ్ జైలుకు వెళ్లి ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
కేటీఆర్, హరీశ్ నచ్చజెబుతున్నారు: యెన్నం
త్వరలోనే ఆదిలాబాద్‌లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్
ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్/న్యూఢిల్లీ, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): లిక్కర్ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అప్రూవర్‌గా మారబోతున్నట్లు తెలుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు. అందుకే కేటీఆర్, హరీశ్‌రావులు తిహాడ్ జైలుకు వెళ్లి ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సీఎల్పీ మీడియా హాల్‌లో శనివారం యెన్నం మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా ఫామ్‌హౌ్‌సకు రావాలని కేసీఆర్ పిలుస్తుంటే.. వారంతా ఢిల్లీకి వెళుతున్నారని అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ తరఫున కేటీఆర్, హరీశ్‌రావు తప్ప ఎవరూ మిగలరని అన్నారు. కాగా, ఆదిలాబాద్ ప్రజల చిరకాల కోరిక అయిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం త్వరలోనే సాకారం కాబోతోందని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు.
ఎయిర్ ఫోర్స్ స్టేషన్ విషయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేశామని, ఆయన సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నిర్మిస్తామని 2014లోనే ప్రధాని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం భూమి, ఎన్‌వోసీ ఇవ్వకుండా పదేళ్లు కాలయాపన చేసిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం భూమి కేటాయించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతిపాదనలు పంపాలని కోరారు.