Share News

US Consul General: అసదుద్దీన్‌తో అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

ABN , Publish Date - Aug 16 , 2024 | 04:05 AM

హైదరాబాద్‌ ఎంపీ, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ భేటీ అవడంపై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది.

US Consul General: అసదుద్దీన్‌తో అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

హైదరాబాద్‌ ఎంపీ, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ భేటీ అవడంపై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది. జెన్నిఫర్‌ అసదుద్దీన్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. వ్యక్తిగత స్థాయిలో జరిగిన ఈ భేటీ గురించి సోమవారం జెన్నిఫర్‌ తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించారు. భేటీ సందర్భంగా అసదుద్దీన్‌తో దిగిన ఫొటోను కూడా తన పోస్టుకు జత చేశారు.


కాగా, ఈ విషయంపై నెటిజన్లు మండిపడుతూ వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. భారత రాజకీయాల్లో అమెరికా జోక్యానికి జెన్నిఫర్‌ భేటీ నిదర్శనమని ఒక నెటిజెన్‌ అన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో రంజాన్‌ సమయంలో అసదుద్దీన్‌ను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. మరో నెటిజన్‌ విదేశీయులు, ముఖ్యంగా ఇలాంటి దౌత్యవేత్తలు, సిబ్బందిపై ఎన్‌ఐఏ దృష్టి సారించాలని సలహా ఇచ్చారు.

Updated Date - Aug 16 , 2024 | 04:05 AM