Share News

Yadagirigutta: గోపురం స్వర్ణ తాపడానికి విరాళాలివ్వండి

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:39 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన రాజగోపురం స్వర్ణ తాపడానికి విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు.

Yadagirigutta: గోపురం స్వర్ణ తాపడానికి విరాళాలివ్వండి

  • భక్తులకు ప్రభుత్వ విప్‌ ఐలయ్య వినతి

భువనగిరి అర్బన్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన రాజగోపురం స్వర్ణ తాపడానికి విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు. ఆదివారం యాదగిరికొండపై విరాళాల సేకరణ కేంద్రం, వృద్ధులు, దివ్యాంగుల కోసం నిర్మించిన షెడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. గాలి గోపురానికి బంగారు తాపడం పనులు దసరా నుంచి ప్రారంభించినట్లు తెలిపారు.


కొత్తగా అఖండ దీపారాధన అందుబాటులోకి వచ్చిందని, 3 నెలల్లో కొండపైన 200 వసతి గదుల నిర్మాణం, 2 వేల వాహనాలకు పార్కింగ్‌ సదుపాయంతో పాటు కొండకింద 5 వేల మంది ఒకేసారి భోజనం చేసేందుకు అన్నదాన సత్రం కూడా అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి బంగారు తాపడానికి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. నిత్యాన్నదానం కోసం ఆలయ సిబ్బంది 285 మంది అందజేసిన ఒకరోజు వేతనం రూ. 5,30,000 విరాళం చెక్కును ఈవో భాస్కరరావు ఐలయ్యకు అందజేశారు.

Updated Date - Oct 21 , 2024 | 04:39 AM