Share News

Hyderabad: పోలీసు అకాడమీని సందర్శించిన ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:50 AM

తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శిక్షణ కేం ద్రం(టీజీపీఏ)ను ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు సందర్శించారు. ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌లో భాగంగా ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు శనివారం అకాడమీకి వచ్చారు. అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌, ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు.

Hyderabad: పోలీసు అకాడమీని సందర్శించిన ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు

కుమార్తెకుసెల్యూట్‌ చేసి ఆహ్వానించిన తండ్రి!

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శిక్షణ కేంద్రం(టీజీపీఏ)ను ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు సందర్శించారు. ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌లో భాగంగా ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు శనివారం అకాడమీకి వచ్చారు. అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌, ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు. అకాడమీ పనితీరును డిప్యూటీ డైరెక్టర్‌ నర్మద వారికి వివరించారు. అకాడమీ మొత్తం సందర్శించిన ఐఏఎ్‌సలు ఆయా విభాగాల పనితీరు తెలుసుకున్నారు.


కాగా అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి (2023 బ్యాచ్‌ ఐఏఎస్‌) కూడా వచ్చిన వారిలో ఉన్నారు. కుమార్తె ఐఏఎస్‌ అధికారి హోదాలో రాగా తండ్రి సెల్యూట్‌ చేసి ఆహ్వానించడం ప్రత్యేకంగా నిలిచింది.

Updated Date - Jun 16 , 2024 | 04:50 AM