Share News

2024-25 Annual Budget: నేడు బడ్జెట్‌పై సాధారణ చర్చ..

ABN , Publish Date - Jul 27 , 2024 | 05:07 AM

2024-25 వార్షిక బడ్జెట్‌పై శాసనసభ, మండలిలలో శనివారం సాధారణ చర్చ జరగనుంది.

2024-25 Annual Budget: నేడు బడ్జెట్‌పై సాధారణ చర్చ..

హైదరాబాద్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): 2024-25 వార్షిక బడ్జెట్‌పై శాసనసభ, మండలిలలో శనివారం సాధారణ చర్చ జరగనుంది. శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు గురువారం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సభ్యులు అడిగే ప్రశ్నలకు శాసనసభలో భట్టి, శాసనమండలిలో శ్రీధర్‌ బాబు సమాధానాలు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో శనివారం ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు.

Updated Date - Jul 27 , 2024 | 05:08 AM