Share News

Hyderabad: బోనాల జాతరకు సర్వం సిద్ధం..

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:17 AM

ఈనెల 28వ తేదీన జరగనున్న ఆషాఢం బోనాల జాతర(Ashadham bonala fair)కు ఆలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆయా ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకొని భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.

Hyderabad: బోనాల జాతరకు సర్వం సిద్ధం..

- పూర్తయిన విద్యుత్‌ దీపాల అలంకరణ

- ఏర్పాట్లు సిద్ధం చేసిన ఆలయ కమిటీలు

హైదరాబాద్: ఈనెల 28వ తేదీన జరగనున్న ఆషాఢం బోనాల జాతర(Ashadham bonala fair)కు ఆలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆయా ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకొని భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. గోల్నాక శ్రీలక్ష్మీనగర్‌లోని శ్రీదేవి నల్లపోచమ్మ దేవాలయాన్ని ఇప్పటికే ముస్తాబు చేశారు. ఆలయానికి రంగులు వేసి విద్యుత్‌ దీపాలతో అలంకరించి ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం అమ్మవారికి అభిషేకం, అలంకరణ, ఆలయ కమిటీ పక్షాన బోనం సమర్పిస్తారని కమిటీ ప్రధాన కార్యదర్శి కొమ్మిడి గోపాల్‌రెడ్డి తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం..


ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అలాగే తొట్టెల, ఫలహారం బండ్ల ఊరేగింపులు ఆలయానికి తరలి వస్తాయని ఆయన తెలిపారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, కార్పొరేటర్‌ దూసరి లావణ్యశ్రీనివాస్ గౌడ్‌, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఆలయాన్ని సందర్శించనున్నారని ఆయన తెలిపారు.


city4.2.jpg

గంగానగర్‌ మైసమ్మ ఆలయంలో..

బోనాల ఉత్సవాలను పునస్కరించుకున్ఝిగంగానగర్‌లోని శ్రీమహంకాళి, శ్రీబంగారుమైసమ్మ దేవాలయాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. బస్తీ కమిటీ సభ్యులు ఆర్‌.కె. బాబు, కె.రాంచందర్‌, సింగీతం రాజేష్‌, శేఖర్‌, పరుశురాం, లక్ష్మీనారాయణ, కె.చందు తదితరులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.

రేపు శాంకంబరీ ఆలంకరణలో దర్శనం

ముషీరాబాద్‌: ముషీరాబాద్‌ మహాంకాళి దేవాలయ బోనాలు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆలయ కమిటీ, ఈవో జి. సత్యనారాయణ, ఆలయ ప్రధాన అర్చకుడు వై.చంద్రమౌళి తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అమ్మవారిని శుక్రవారం శాకంబరీ అలంకరణలో ముస్తాబు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. ఈ నెల 28న అఖండ దీపారాధన, చంఢీహోమం, కుంకుమార్చన, ఫలాహర బండ్ల ఊరేగింపు తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. 29వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు స్వర్ణలతచేత రంగం కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం అమ్మవారి ఘటం వీడ్కోలు, బలిగంప పూజ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.


నేడు బంగారు మైసమ్మ కల్యాణం

భోలక్‌పూర్‌ డివిజన్‌ మహాత్మానగర్‌ బంగారు మైస మ్మ దేవాలయంలో అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోఆర్డినేటర్‌ బిజ్జి కనకేష్‌ కుమార్‌ గురువారం తెలిపారు. కల్యాణానికి బీజేపీ ఎంపీ డాక్టర్‌ కె. లక్ష్మణ్‌, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యు డు పూసరాజు, కార్పొరేటర్లు సుప్రియా నవీన్‌ గౌడ్‌, రవిచారి, పావని వినయ్‌ కుమార్‌, రచనశ్రీ, బీజేపీ రాష్ట్ర నాయకులు హాజరవుతారని ఆయన తెలిపారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 26 , 2024 | 11:18 AM