Home » Bonalu Festival
పల్లె, పట్నం అనే తేడా లేదు. పండగ, జాతర అని కూడా చూడటం లేదు. ఏ సందర్భం అయినా సరే తమకు లెక్కలేదని ఆకతాయిలు అంటున్నారు. ఇటీవల బోనాల పండగ ఘనంగా ముగిసింది. బోనాల సమయంలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాధితులు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది కేసు ఫైల్ చేశారు. బోనాల పండగ సమయంలో అత్యధికంగా 305 మందిపై కేసులు నమోదయ్యాయి.
నెత్తిన బోనమెత్తిన ఆడబిడ్డల భక్తి పారవశ్యం.. అమ్మవారు ఆవహించి సిగమూగిన శివసత్తుల పూనకం.. ఒంటి నిండా పసుపు ధరించి, ముఖానికి మెరిసే రంగులద్ది, చేతిలో కొరడా ఝళిపిస్తూ పోతరాజుల వీరంగం.. డప్పు చప్పుళ్లు, పోరగాళ్ల చిందుల నడుమ ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల పండుగ జోరుగా సాగింది.
భాగ్యనగరంలో బోనాల వేడుక(Bonalu Festival) ఘనంగా జరుగుతోంది. ఆదివారం పాతబస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల మహోత్సవం ప్రారంభమైంది. ఇవాళ ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటగా మారాయి.
మద్యం ప్రియులకు నిజంగా చేదువార్త.. ఎందుకంటే.. అసలే వీకెండ్.. ఆదివారం సరదగా కాసేపు ఓ పెగ్గు వేసుకుని పడుకోవచ్చని అంతా అనుకుంటూ ఉంటారు. ఇంతలో మందు షాపులు బంద్ అంటే మద్యం ప్రియులకు ఎలా ఉంటుంది.
పాతబస్తీలో ఆదివారం జరగనున్న లాల్‌దర్వాజా మహాకాళి(Laldarwaja Mahakali) బోనాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు, నాయకులు, వీఐపీలు వచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా, ఏసీపీ చంద్రశేఖర్ ఏర్పాట్లను శుక్రవారం పర్యవేక్షించారు.
ఈనెల 28వ తేదీన జరగనున్న ఆషాఢం బోనాల జాతర(Ashadham bonala fair)కు ఆలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆయా ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకొని భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.
మండలంలోని వేప కుంట గ్రామంలో మంగళవారం పోతలయ్యస్వామికి ఘనంగా బోనాల ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, యువకులు బోనాలు త్తుకుని వెళ్లి స్వామివారికి సమర్పించారు. అనంత రం పోతలయ్యస్వామికి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.
పాడిపంటల్లో ఔషధాల వినియోగం తగ్గించండి.. అప్పుడే ఆరోగ్యం చక్కబడుతుంది. ఆయుష్షు పెరుగుతుంది.. అంటూ భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉజ్జయిని మహాకాళి(Ujjaini Mahakali) బోనాల జాతరలో సోమవారం రంగం నిర్వహించారు.
Telangana: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమంలో ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తరవాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని స్వర్ణలత భవిష్యవాణి పలికారు. అమ్మవారి ప్రతిరూపంలో మాతంగి స్వర్ణలత ఏ ఏ అంశాలు వ్యక్తపరుస్తుందనే ఆసక్తితో ఎదురు చూస్తున్న భక్తజనానికి అమ్మవారికి పలుకులు ఆనందాన్ని ఇచ్చాయి.
ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. నెత్తిన బోనమెత్తి వచ్చిన ఆడబిడ్డలు, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లష్కర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.