Share News

Telangana: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్స్ బంద్.. కారణమిదే..!

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:37 PM

మద్యం ప్రియులకు నిజంగా చేదువార్త.. ఎందుకంటే.. అసలే వీకెండ్.. ఆదివారం సరదగా కాసేపు ఓ పెగ్గు వేసుకుని పడుకోవచ్చని అంతా అనుకుంటూ ఉంటారు. ఇంతలో మందు షాపులు బంద్ అంటే మద్యం ప్రియులకు ఎలా ఉంటుంది.

Telangana: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్స్ బంద్.. కారణమిదే..!
Wines

మద్యం ప్రియులకు నిజంగా చేదువార్త.. ఎందుకంటే.. అసలే వీకెండ్.. ఆదివారం సరదగా కాసేపు ఓ పెగ్గు వేసుకుని పడుకోవచ్చని అంతా అనుకుంటూ ఉంటారు. ఇంతలో మందు షాపులు బంద్ అంటే మద్యం ప్రియులకు ఎలా ఉంటుంది. ఎన్నో ఆశలతో వీకెండ్ ఎంజాయ్ చేద్దామనుకునేవాళ్లంతా ఒక్కసారిగా నిరాశలోకి వెళ్లిపోతారు. కొందరైతే.. ఆదివారం సెలవైతే.. ముందురోజే మద్యం కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటారు. అసలు మద్యం షాపులు ఆదివారం సెలవు ఎందుకు అనుకుంటున్నారా.. తెలంగాణ మొత్తం కాదండి.. కేవలం హైదరాబాద్‌ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జులై 28 ఆదివారం మద్యం షాపులు తెరుచుకోవు. 24 గంటల పాటు వైన్స్ బంద్ అని పోలీసులు ప్రకటించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మందు షాపులు తెరిచినా.. లేదా రహస్యంగా ఆ ప్రాంతాల్లో మందు విక్రయించినా చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇప్పటికే హెచ్చరించారు. ఎన్నికలు అయిపోయాయి కదా.. మళ్లీ ఇప్పుడు వైన్స్ బంద్ ఏమిటనుకుంటున్నారా.. మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ సిటీలో జులై 28 ఉదయం ఆరుగంటల నుంచి 29వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.


24 గంటల పాటు..

సౌత్ ఈస్ట్ జోన్‌లో చాంద్రాయణగుట్ట, బండ్లగూడ వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు మద్యం దుకాణాలు మూసివేస్తారు. సౌత్ జోన్‌లో చార్మినార్, కమాటిపుర, హుస్సేనీ ఆలం, ఫలక్‌నుమా, మొఘల్‌పురా, చత్రినాక, షాలిబండ, మీర్‌చౌక ప్రాంతాల్లో జులై 28 ఉదయం 6 గంటల నుంచి రెండు రోజులపాటు కల్లు, వైన్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్ లు, మద్యం విక్రయించే సంస్థలు మూసి ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఆషాఢ మాసం ప్రారంభం నుంచి నగర వ్యాప్తంగా బోనాల పండగ వైభవంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీ మహంకాళి లాల్‌ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా అంబారీ పై అమ్మవారి ఊరేగింపు వేడుకలు జరగనున్నాయి. ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. భారీ ఎత్తున భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ క్రమంలో జులై 28, 29 తేదీల్లో హైదరాబాద్ నగరంలో వైన్ షాపులు పూర్తిగా మూసివేయనున్నారు.


నిబంధనలు ఉల్లంఘిస్తే..

పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వైన్ షాపు అనుమతులు రద్దు చేస్తామని ఇప్పటికే హైదరాబాద్ సీపీతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. అలాగే ఎవరైనా పరిమితికి మించి స్టాక్ ఉంచి.. ఏదైనా ప్రదేశంలో విక్రయించినా నేరంగానే పరిగణిస్తామని పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.


Telangana Assembly: ‘హాఫ్ నాలెడ్జ్.. డమ్మీ’.. అసెంబ్లీలో హరీష్ vs కోమటిరెడ్డి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jul 27 , 2024 | 12:40 PM