Share News

Rangam Bhavishyavani: ఆనందపరిచేలా స్వర్ణలత భవిష్యవాణి.. వైభవంగా ‘రంగం’ ఘట్టం

ABN , Publish Date - Jul 22 , 2024 | 10:46 AM

Telangana: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమంలో ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తరవాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని స్వర్ణలత భవిష్యవాణి పలికారు. అమ్మవారి ప్రతిరూపంలో మాతంగి స్వర్ణలత ఏ ఏ అంశాలు వ్యక్తపరుస్తుందనే ఆసక్తితో ఎదురు చూస్తున్న భక్తజనానికి అమ్మవారికి పలుకులు ఆనందాన్ని ఇచ్చాయి.

Rangam Bhavishyavani: ఆనందపరిచేలా స్వర్ణలత భవిష్యవాణి.. వైభవంగా ‘రంగం’ ఘట్టం
Matangi Swarnalatha Bhavishyavani

హైదరాబాద్, జూలై 22: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో (Ujjayini Mahankali Temple) రంగం కార్యక్రమంలో ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తరువాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని స్వర్ణలత భవిష్యవాణి పలికారు. అమ్మవారి ప్రతిరూపంలో మాతంగి స్వర్ణలత ఏ ఏ అంశాలు వ్యక్తపరుస్తుందనే ఆసక్తితో ఎదురు చూస్తున్న భక్తజనానికి అమ్మవారికి పలుకులు ఆనందాన్ని ఇచ్చాయి.

Smita Sabharwal : సివిల్స్‌లో దివ్యాంగుల కోటా అవసరమా?


ఈ ఏడాది కూడా వర్షాలు బాగా కురుస్తాయని అమ్మవారు అభయమిచ్చారు. అందరినీ సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటానని తెలిపారు. వర్షంలో తడిచి మరీ భక్తులు బోనాలు సమర్పించి.. దర్శించుకున్నారంటూ అమ్మవారికి పూజారులు తెలుపగా.. ఆ మాత్రం కష్టపడాలని... లేకపోతే సోమరిపోతులు అవుతారని అమ్మవారు పలికారు. ఈ ఏడాది ఐదువారాల పాటు పప్పు బెళ్లాలతో సాక పెట్టాలని భక్తులను అమ్మవారు ఆజ్జాపించారు.

Godavari: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మరి కొద్దిసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక!


ప్రశ్నలకు అమ్మవారి సమాధానం...

ప్రశ్న : 250ఏళ్లుగా లష్కర్‌కు వచ్చి ప్రజలను ఆశీర్వదిస్తున్నావ్. ఈ ఏడాది 16 రోజులుగా జాతర జరిపించుకున్నావ్. నీ ఆశీర్వాదం తెలుపు?

జవాబు: ఈ ఏడాది పూజలు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను. నన్ను కొలిచి నిండే నిలిచిన మహంకాళి నేను.

ప్ర. బోనాలు నీ పూజలో ప్రత్యేకం. బోనాలు ఎవరు, ఎలా జరిపించాలి?.

జ. ఏ బోనం అయినా, ఎవరు ఎత్తుకొచ్చినా పర్వాలేదు. సంతోషంగా అందుకునేది నేనే. వీళ్ళు, వాళ్ళు తేవాలని సందేహం పెట్టుకోకండి. ఎవరు తెచ్చినా సంతోషంగా అందుకునే బాధ్యత నాది.

ప్ర. వర్షాలు ఎలా కురుస్తాయి? పాడి పంటలు ఎలా ఆశీర్వదిస్తావు? వ్యాధులు లేకుండా ఎలా చూస్తావ్?

జ. కోరినంత వర్షాలు వుంటాయి. మంచిగా చూసుకుంటాను. ఎటువంటి లోటు లేదు మీకు. మీరు ఆనందంగా, సంతోషంగా ఉండండి. అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్ముకున్న వారిని కాపాడుకుంటా.

ప్ర. కోట్ల మంది ప్రజలు నీ దర్శనం చేసుకున్నారు. 48 గంటలు వర్షంలో తడిచి దర్శనం చేసుకున్నారు. నీ తృప్తిని తెలియజేయి.

జ. నా దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. లేదంటే సోమరి పోతులు అవుతారు. పిల్లలు, పెద్దలు, జంతువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను.

ప్ర. ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా అమ్మ . నువ్వు ఏమి కోరుకుంటున్నావ్?

జ. నా రూపం పెట్టాలి అనుకుంటున్నారు కదా .. పెట్టండి. ఎవరు ఏం చేసినా, ఎవరెంత అడ్డుపడినా నా రూపం నేను పెట్టించుకుంటాను. తప్పని సరిగా నా రూపాన్ని నేను నిలబెట్టుకుంటా.

ఇది నీ ఆశీర్వాదం కాదు. ఆఘ్నగా భావించి ఆ కార్యక్రమంలో ఉంటాం. నీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తాం.

నా గ్రామ ప్రజలు అందరికీ నేను సంతోషంగా ఉండటానికి సళ్ళని సాక పెడుతున్నారు. ఈ సారి కూడా 5 వారాలు పప్పు బెల్లలతో శాఖ పెట్టండి.

ప్ర. ప్రజలు వ్యాధులు, డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వారికి ని చల్లని చూపుకావాలి.

జ. చదువుని ఏటికేడు ఎక్కువ చేసుకున్నారు అనుకుంటున్నారు కానీ .. పాడి పంటలు ఇదివరకు లాగా పండించడం లేదు. ఔషధాలు ఎక్కువ వాడుతున్నారు. అందుకే అనారోగ్యం. వాటిని తగ్గించుకుంటే మీకు వ్యాధులు తగ్గుతాయి.

ప్ర. బలి కార్యక్రమం నచ్చిందా అమ్మ.

జ. రక్త పాశం ఇవ్వడం లేదు. మీకు నచ్చింది ఇస్తున్నారు. దానితోనే సంతోష పడుతున్నాను.

ప్ర. భక్తులను ఆదరించి, ఆశీర్వదించి తల్లి.

జ. సంతోషంగా ఘనంగా అందుకున్నాను. పిల్లలకు, గర్భిణులకు ఏం ఇబ్బంది రానివ్వను. అందరినీ సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను.


ఇవి కూడా చదవండి..

Bhadrachalam: ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Parliament Sessions: బలమైన ప్రతిపక్షం, మిత్రపక్షాల డిమాండ్‌లు.. మోదీకి విషమ పరీక్ష!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2024 | 12:20 PM