Share News

Hyderabad: 305 మందిపై కేసులు, పోక్సో కేసు కూడా

ABN , Publish Date - Aug 05 , 2024 | 12:33 PM

పల్లె, పట్నం అనే తేడా లేదు. పండగ, జాతర అని కూడా చూడటం లేదు. ఏ సందర్భం అయినా సరే తమకు లెక్కలేదని ఆకతాయిలు అంటున్నారు. ఇటీవల బోనాల పండగ ఘనంగా ముగిసింది. బోనాల సమయంలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాధితులు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది కేసు ఫైల్ చేశారు. బోనాల పండగ సమయంలో అత్యధికంగా 305 మందిపై కేసులు నమోదయ్యాయి.

Hyderabad: 305 మందిపై కేసులు, పోక్సో కేసు కూడా
She Teams

హైదరాబాద్: పల్లె, పట్నం అనే తేడా లేదు. పండగ, జాతర అని కూడా చూడటం లేదు. ఏ సందర్భం అయినా సరే తమకు లెక్కలేదని ఆకతాయిలు అంటున్నారు. ఇటీవల బోనాల పండగ ఘనంగా ముగిసింది. బోనాల సమయంలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాధితులు షీ టీమ్స్‌కు (She Teams) ఫిర్యాదు చేశారు. ఇంకేముంది కేసు ఫైల్ చేశారు. బోనాల పండగ సమయంలో అత్యధికంగా 305 మందిపై కేసులు నమోదయ్యాయి.


16 మంది మైనర్లు

305 మందిలో 289 మంది మేజర్లు ఉన్నారు. 16 మంది మైనర్లు అని పోలీసు అధికారులు వివరించారు. వీరిలో 173 మంది కుటుంబ సభ్యులతో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఐదుగురిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. మూడు రోజుల జైలు శిక్ష, రూ.1050 జరిమానా విధించారు. బోనాల పండగ సమయంలో కాకుండా జూలై నెలలో మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించి 115 కేసులు వచ్చాయని షీ టీమ్స్ ప్రతినిధులు వివరించారు. 19 ఎఫ్ఐఆర్‌ హైదరాబాద్‌లో గల వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. నాలుగు పోక్సో కింద కేసు ఫైల్ చేశారు. (మైనర్లను వేధిస్తే పోక్సో కేసు ఫైల్ చేస్తారు.) మరో 22 కేసుల్లో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. షీ టీమ్స్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ కేసులు లైంగికదాడి, మోసం, పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులే ఉన్నాయి.


ఏ ఒక్కరిని వదలం

305 కేసుల్లో తీవ్రత ఉన్న కేసులు తక్కువ ఉన్నాయి. చిన్న కేసుల్లో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఛీట్ చేసిన కేసుల్లో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. మైనర్లను వేధించిన ఘటనలో నలుగురిపై పోక్సో కేసులు పైల్ చేశారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు. బాధితులకు.. ముఖ్యంగా మహిళలకు అండగా ఉంటామని, వారికి న్యాయం చేస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో షీ టీమ్స్ ఏర్పాటైన తర్వాత నేరాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.


Read latest
Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2024 | 12:34 PM