Share News

Hyderabad: హైదరాబాద్‌-విజయపుర రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Sep 29 , 2024 | 11:26 AM

నైరుతి రైల్వే హుబ్లీ డివిజన్‌(Hubli Division) పరిధిలో భీమా వంతెన వద్ద రైల్వేట్రాక్‌ మునిగిపోవడంతో ఆ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది.

Hyderabad: హైదరాబాద్‌-విజయపుర రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..

హైదరాబాద్‌: నైరుతి రైల్వే హుబ్లీ డివిజన్‌(Hubli Division) పరిధిలో భీమా వంతెన వద్ద రైల్వేట్రాక్‌ మునిగిపోవడంతో ఆ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. నేటి నుంచి అక్టోబర్‌ 1 వరకు కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారిమళ్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 1వ తేదీల్లో విజయపుర-హైదరాబాద్‌ (17029) రైలును రద్దు చేశారు. సెప్టెంబర్‌ 29, 30, అక్టోబర్‌ 1 తేదీల్లో హైదరాబాద్‌-విజయపుర (17030), అక్టోబర్‌ 1న రాయచూర్‌-విజయపుర (07664), సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 1, 2 తేదీల్లో విజయపుర-రాయిచూర్‌ (07663) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 29, 30, అక్టోబర్‌ 1వ తేదీల్లో హుబ్లీ-హైదరాబాద్‌ (17319), సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 1, 2 తేదీల్లో హైదరాబాద్‌-హుబ్లీ (17320) రైళ్లను దారి మళ్లించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: గత ఏడాది 406 మంది రైతుల ఆత్మహత్య


మరోవైపు అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర రైలు శనివారం సికింద్రాబాద్‌(Secunderabad) నుంచి బయలుదేరి వెళ్లింది. పితృదినాల సందర్భంగా కాశీ, గయ క్షేత్రాల్లో సంప్రదాయం ప్రకారం పితృదేవతలకు పిండప్రదానం చేయడానికి వీలుగా రైలు యాత్రకు రూపకల్పన చేశారు. తొమ్మిది రోజుల పాటు గయ, వారాణసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లోని పుణ్యక్షేత్రాలను సందర్శించడంతో పాటు కాశీ, గయలో యాత్రికులు తమ పూర్వికులకు నివాళులర్పించే సౌకర్యాన్ని కల్పించారు.


.................................................................

ఈ వార్తను కూడా చదవండి:

...................................................................

Collector: అధైర్యపడొద్దు.. ఇళ్లు ఇస్తాం..

- రంగారెడ్డి కలెక్టర్‌ శశాంక

city2.2.jpg

హైదరాబాద్: మూసీ రివర్‌బెడ్‌ ప్రాంతంలో ఇండ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న వారికి అవగాహన కల్పించి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయిస్తున్నామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక(Collector Shashanka) అన్నారు. శనివారం రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, ఆర్డీవో వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ రాములుతో కలిసి మాట్లాడారు. రాజేంద్రనగర్‌, గండిపేట(Rajendranagar, Gandipet) మండలాల పరిధిలో విస్తరించి ఉన్న మూసీ రివర్‌బెడ్‌ ప్రాంతంలో 339 నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించామని, అందులో 175 ఇండ్లు ఉన్నాయని, మిగతావి మెకానిక్‌ షెడ్లు, ప్లాస్టిక్‌ కార్ఖానాలు ఉన్నాయన్నారు.


city2.jpg

ఇండ్లు నిర్మించుకుని ఉంటున్న వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌లు ఇస్తామని తెలిపారు. శనివారం 22 మందికి నార్సింగ్‌, జియాగూడ ప్రాంతాల్లో ఇళ్ల సర్టిఫికేట్లు ఇచ్చామని తెలిపారు. ఒకే ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు ఉంటే వారికి వేర్వేరుగా ఇస్తామన్నారు. మూసీ నిర్వాసితులు అధైర్యపడవద్దని కలెక్టర్‌ శశాంక భరోసా ఇచ్చారు.


ఇదికూడా చదవండి: BRS.. రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం ఆపాలి: హరీష్ రావు

ఇదికూడా చదవండి: BRS: హైడ్రా బాధితుల వద్దకు బీఆర్ఎస్ నేతలు..

ఇదికూడా చదవండి: గచ్చిబౌలి స్టేడియంలో ‘పింక్ పవర్ రన్ 2024’

ఇదికూడా చదవండి: Khammam: రెండు రేషన్‌ కార్డులపై ఇంటెలిజెన్స్‌ విచారణ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 29 , 2024 | 11:33 AM