Share News

Hyderabad: సబితారెడ్డి కాంగ్రెస్‏లోకి రావద్దంటూ నిరసన..

ABN , Publish Date - Jul 02 , 2024 | 11:43 AM

తన స్వార్ధం కోసం తల్లిలాంటి కాంగ్రెస్‌ పార్టీని వదిలి సీఎల్పీని టీఆర్‌ఎస్‏లో విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్యే సబితారెడ్డి(MLA Sabita Reddy) అధికార దాహంతో తిరిగి కాంగ్రెస్‏లోకి రావడానికి ప్రయత్నించడం సహించరానిదని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad: సబితారెడ్డి కాంగ్రెస్‏లోకి రావద్దంటూ నిరసన..

హైదరాబాద్: తన స్వార్ధం కోసం తల్లిలాంటి కాంగ్రెస్‌ పార్టీని వదిలి సీఎల్పీని టీఆర్‌ఎస్‏లో విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్యే సబితారెడ్డి(MLA Sabita Reddy) అధికార దాహంతో తిరిగి కాంగ్రెస్‏లోకి రావడానికి ప్రయత్నించడం సహించరానిదని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబితారెడ్డి కాంగ్రెస్‏లోకి వస్తున్నారన్న సమాచారంతో ఆర్కేపురం, సరూర్‌నగర్‌ డివిజన్ల పార్టీ ఆధ్వర్యంలో కొత్తపేట చౌరస్తాలో సబితారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీపై గెలిచిన 12మంది ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించడానికి ముఖ్య పాత్ర పోషించిన సబితారెడ్డి తన రాజకీయ స్వార్ధం, అధికార దాహంతో తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి రావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఏడాదిగా ఆగని వరకట్న వేధింపులు.. మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య


city6,2.jpg

కాంగ్రెస్‏లో ఉండి ఎంతో అభివృద్ధి చెందిన ఆమె కష్టకాలంలో ఉన్న పార్టీని కాపాడుకోవాల్సింది పోయి, తల్లిలాంటి పార్టీని వదిలిపెట్టి టీఆర్‌ఎ్‌సలోకి వెళ్లడం క్షమించరానిదన్నారు. తన అధికార దర్పంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను నానా ఇబ్బందులకు గురిచేసి అడుగడుగునా అణచివేతకు గురిచేసి, కేసులు పెట్టించి జైలుకు పంపిన చరిత్ర మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండడంతో తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం తిరిగి పార్టీలోకి రావడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తురన్నారు. ఇలాంటి స్వార్ధ రాజకీయ నాయకులను తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు చిలుక ఉపేందర్‌రెడ్డి, బండి మధుసూదన్‌రావు, శంకర్‌యాదవ్‌, ధనరాజ్‌గౌడ్‌, రమేష్ నేత, జ్ఞానేశ్వర్‌యాదవ్‌, పెద్దవూర సైదులు, దుబ్బాక శేఖర్‌ పాల్గొన్నారు.


పార్టీ మారాల్సిన అవసరం సబితారెడ్డికి లేదు: అరవింద్‌శర్మ

ఎమ్మెల్యే సబితారెడ్డికి పార్టీ మారాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్‌ మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్‌శర్మ అన్నారు. సోమవారం గ్రీన్‌హిల్స్‌ కాలనీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లోకి సబితారెడ్డి మారుతున్నట్లు సోషల్‌ మీడియాలో, దిష్టిబొమ్మను దహనం చేయడం కాంగ్రెస్‌ దిగజారిన రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. పలు వేదికలపై తాను పార్టీ మారడం లేదని స్వయంగా సబితారెడ్డి వెల్లడించిన విషయం మరువరాదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితువు పలికారు. కేసీఆర్‌ సారథ్యంలో సబితారెడ్డి బీఆర్‌ఎస్‌లో కొనసాగుతారన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ నాయకులకు అనుమానాలు, అపోహలు అవసరం లేదని పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 11:43 AM