Hyderabad: వామ్మో జ్వరం.. పెరుగుతున్న వైరల్ ఫీవర్ల బాధితులు
ABN , Publish Date - Sep 14 , 2024 | 01:23 PM
గ్రేటర్ హైదరాబాద్(Hyderabad)లో జ్వరాలతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒక్క ఫీవర్ ఆస్పత్రికే 600 నుంచి 800 వరకు ఓపీ కేసులు వస్తున్నాయి. వైరల్ ఫీవర్లు, డెంగీ(Fevers, dengue), వాంతులు, విరేచనాలు, కీళ్లనొప్పులు, చలిజ్వరంతో బాధితులు క్యూ కడుతున్నారు.
- ఇమ్యూనిటీ లోపంతో ఇబ్బందులు
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad)లో జ్వరాలతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒక్క ఫీవర్ ఆస్పత్రికే 600 నుంచి 800 వరకు ఓపీ కేసులు వస్తున్నాయి. వైరల్ ఫీవర్లు, డెంగీ(Fevers, dengue), వాంతులు, విరేచనాలు, కీళ్లనొప్పులు, చలిజ్వరంతో బాధితులు క్యూ కడుతున్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు 1500 నుంచి 2వేల వరకు ఓపీ కేసులు వస్తున్నాయి. నిలోఫర్ ఆస్పత్రిలో పిల్లల ఓపీ కూడా పెరిగింది.
ఇదికూడా చదవండి: Hyderabad: టార్గెట్ 1:30 pm.. ఆ సమయానికల్లా..
ఇమ్యూనిటీ దెబ్బతింటోంది..
ఒకసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల చాలా మందిలో ఇమ్యూనిటీ(Immunity) దెబ్బతింటుంది. అలాంటి వారికి ఇన్‌ఫెక్షన్‌ను తట్టుకునే శక్తి సన్నగిల్లుతుందని వైద్యులు చెబుతున్ననరు. మురికివాడల్లో అపరిశుభ్రత కారణంగా దోమలు వ్యాప్తి చెంది వ్యాధులకు కారణమవుతున్నాయి.
ప్రతి ఇంట్లో ఒకరిద్దరు..
దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరం బాధితులు ఉంటున్నారు. ఒకరి తర్వాత మరొకరు వైరల్ ఫీవర్లతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల ఓపీకి వచ్చే కేసులలో వైరల్ ఫీవర్లవే ఎక్కువగా ఉంటున్నాయి. వాటిలో 20 నుంచి 30 శాతం మందికి డెంగీ లక్షణాలు ఉంటున్నాయి.
వేడి ఆహారంతో బ్యాక్టీరియాకు చెక్..
కలుషిత నీరు, దోమల వల్ల జబ్బులు దాడి చేసే ముప్పు ఎక్కువగా ఉంది. నీటిని 100 సెంటిగ్రేడ్ వద్ద పది నిమిషాలు మరగబెట్టి ఆ తరువాత చల్లార్చి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. అన్నం కూడా వేడిగా ఉన్నప్పుడే తినాలి. బ్యాక్టీరియా ఉంటే ఆ వేడికి చనిపోతాయి. వంటలు, భోజనం చేసే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారం ఈ కాలంలో తీసుకోవద్దు. మస్కిటో రిపిల్లెంట్ క్రీమ్స్ నాలుగు గంటలకు ఒకసారి శరీరానికి రాసుకోవాలి. కళ్లవద్ద పూయవద్దు.
- టీఎన్‌జే రాజేష్, ఇంటర్నల్ మెడిసిన్, స్టార్ ఆస్పత్రి
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read LatestTelangana NewsandNational News