Share News

Hyderabad: ఇక ‘హైడ్రా’ హడలెత్తించనుందా?

ABN , Publish Date - Oct 23 , 2024 | 09:40 AM

కూకట్‌పల్లి(Kukatpally)లో హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారులు, ఫుట్‌పాత్‌ వ్యాపారుల గుండెలో వణుకు పుడుతోంది. హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ఏం చేయాలని, తమ వ్యాపారాలు పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్వచ్ఛందంగానే తొలగించుకోవాల్సి వస్తుందా.. లేదంటే స్థానిక నాయకులతో చర్చించాలా అంటూ చిరు వ్యాపారులు చర్చించుకుంటున్నారు.

Hyderabad: ఇక ‘హైడ్రా’ హడలెత్తించనుందా?

- ఫుట్‌పాత్‌ ఆక్రమణదారుల్లో టెన్షన్‌

- స్థానిక నేతలతో మంతనాలు

- ఆక్రమణల తొలగింపుపై స్థానికుల ఎదురుచూపులు

హైదరాబాద్: కూకట్‌పల్లి(Kukatpally)లో హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారులు, ఫుట్‌పాత్‌ వ్యాపారుల గుండెలో వణుకు పుడుతోంది. హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ఏం చేయాలని, తమ వ్యాపారాలు పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్వచ్ఛందంగానే తొలగించుకోవాల్సి వస్తుందా.. లేదంటే స్థానిక నాయకులతో చర్చించాలా అంటూ చిరు వ్యాపారులు చర్చించుకుంటున్నారు. ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ హైడ్రాకు అప్పగించడంతో కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, భాగ్యనగర్‌కాలనీ, మూసాపేట్‌(Kukatpally, KPHB, Bhagyanagar Colony, Musapet) ప్రాంతాల్లో ఎక్కడ చూస్తున్నా ఇవే చర్చలు వినిపిస్తున్నాయి. ఆక్రమణల తొలగింపు ప్రక్రియ అంత సులువైన పనేమి కాదని అధికారులే చర్చించుకుంటుండటం గమనార్హం.

ఈ వార్తను కూడా చదవండి: Nampalli Court: కేటీఆర్ స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్న కోర్టు..


ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు

గత ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారికి ఇరువైపులా అలాగే కాలనీల్లో ప్రధాన మార్గాల్లో ఫుట్‌పాత్‌లను అందంగా తీర్చిదిద్దారు. రోడ్డువైపు రెయిలింగ్‌తో పాటు టైల్స్‌తో అభివృద్ధి చేయడంతో పాదాచారులకు ఎంతో ఉపయోగం ఉంటుందని అందరూ ఆశించారు. కానీ కొందరు చిరువ్యాపారుల ముసుగులో ఫుట్‌పాత్‌లపై తిష్టవేశారు. దీంతో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఫుట్‌పాత్‌లపై చాయ్‌ డబ్బాలు, కూరగాయల విక్రయాలు, టిఫిన్‌ సెంటర్లు, టాయ్స్‌, పూల మొక్కలు, బట్టల దుకాణాలు వెలశాయి. ఫుట్‌పాత్‌ వ్యాపారులతో ట్రాఫిక్‌ సిబ్బంది నెలవారీ మాముళ్ల వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

city4.2.jpg


city4.3.jpg

రాందేవ్‌రావు ఆస్పత్రి, కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్‌-1, కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌ నుంచి మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా, కేపీహెచ్‌బీ టెంపుల్‌ బస్టాపు, కేపీహెచ్‌బీ నాలుగు, ఏడో ఫేజ్‌లు, నెక్సస్‌ మాల్‌ నుంచి గోకుల్‌ చౌరస్తా, కేపీహెచ్‌బీ ఈ సేవా రోడ్డు, సర్దార్‌పటేల్‌నగర్‌ ప్రాంతా ల్లో ఫుట్‌పాత్‌లపై వందల దుకాణాలు స్థానిక నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఫుట్‌పాత్‌లు ఆక్రమించి అద్దెకు ఇచ్చుకున్న వారిలో ఎక్కువ మంది ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు. గతంలో మాదిరిగా తమకు సహకరించిన జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.


హైడ్రాతో మారనున్న రూపురేఖలు

హైడ్రా కమిషనర్‌ రంగంలోకి దిగితే ఆ ప్రాంతంలో రూపురేఖలు మారుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఫుట్‌పాత్‌ ఆక్రమణదారులతో కుమ్మక్కై వ్యాపారాలు సాగించుకునేలా ప్రోత్సహిస్తున్న అధికారులు, సిబ్బంది దీనికి వ్యతిరేఖంగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఎవరెన్ని చెప్పినా ఆ సమయంలో హడావిడీ చేయడమే కానీ క్షేత్రస్థాయిలో ఫుట్‌పాత్‌ ఆక్రమణలు తొలగించడానికి ఇప్పటి వరకు ఎవ్వరూ కృషి చేసిన పాపాన పోలేదు. ఒక్క కూకట్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అప్పటి జడ్సీ అభిలాష అభినవ్‌ ఆక్రమణలను తొలగించడం మినహాయిస్తే.. ఇప్పటి వరకు అలాంటి పనులు ఎక్కడా జరగలేదు.


తొలగింపుపై స్థానికుల ఎదురుచూపు

ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఎప్పడు ప్రారంభిస్తారోనని కేపీహెచ్‌బీ పరిసర ప్రాంత ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేక్స్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఆక్రమణల తొలగింపు సమయంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా అనుకున్న పని పూర్తి చేశారు. అదే తరహాలో ఫుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగిస్తారని, ఫుట్‌పాత్‌లన్నీ పాదాచారులకు అందుబాటులోకి వస్తాయని జనం నమ్ముతున్నారు. హైడ్రా ఎప్పుడు? ఎలా? చేయబోతుందో చూడాలి మరి.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: BRS Leaders : కేటీఆర్‌, హరీశ్‌రావుకు ప్రాణహని!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 23 , 2024 | 09:40 AM