Big Tree: ఎంతటి దుర్మార్గం.. హెచ్చరించినా లెక్క చేయక.. 50 ఏళ్ల చెట్టును
ABN , Publish Date - Oct 08 , 2024 | 11:42 AM
Telangana: తమ వ్యాపారానికి అడ్డు వస్తుందనే కారణంగా లగ్జరీ సికారా క్లినిక్స్, ఫెమినా ఫ్లాంట్ స్టూడియో సెలూన్ నిర్వాహకులు ఈ మహా వృక్షాన్ని తొలగించారు. రోడ్డు మీద వెళ్లేవారికి చెట్టు, దాని కొమ్మలు కనిపించకుండా అడ్డువస్తున్నాయంటూ ఏకంగా సుమారు 50 ఏళ్ల చెట్టును నిర్ధాక్షణ్యంగా నరికివేశారు.
‘‘వృక్షో రక్షితి రక్షిత:’’ వృక్షాలను రక్షిస్తే.. అవి మనల్ని రక్షిస్తాయనేది దీని అర్థం. మనుషులు వదిలిన కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని, మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయి వృక్షాలు. అంతేకాక వృక్షాల వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. చెట్లు మనకు నీడని ఇవ్వడంతో పాటు.. పండ్లు, పూలు, వేర్లు, ఆకులు ఇలా అనేక రకాలుగా చెట్లు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ప్రకృతిలో లభించే ప్రతి మొక్క మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. కానీ మారుతున్న కాలంలో చెట్లను నరికివేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఇళ్ల కోసం, రోడ్ల కోసం ఇలా అనేక విధాలుగా చెట్లు అడ్డుగా ఉన్నాయంటూ వాటిని నరికివేస్తున్నారు. ఒకచోట నరికివేసిన చెట్లను మరోచోట నాటితే బాగుంటుంది.. కానీ అలా జరగడం లేదు. అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లను కొట్టివేడయంతో వర్షపు నీరు భూమికి చేరదు. దాని ఫలితంగా త్రాగు నీరు, జీవాధారమైన తిండి , పీల్చేందుకు స్వచ్చమైన గాలి కరువై మానవుడే కాదు.. ప్రతీ జీవి మనుగడ కష్టతరంగా మారిపోతుంది. ఇప్పటికే అడవులను నరికివేడయంతో మన దేశంలో చాలా అడవులు తరిగిపోతున్నాయి కూడా. ఇక పట్టణాల్లో అయితే చెట్ల పెంపకం చాలా తక్కువ అనే చెప్పుకోవచ్చు. భవనాలు, రోడ్లు, వ్యాపార సముదాయాల కోసం ఎక్కడికక్కడ చెట్లను నరికివేస్తూ వస్తున్నారు. దీంతో చాలా చోట్ల చెట్లు కనిపించకుండా పోతున్నాయి. తాజాగా వ్యాపారానికి అడ్డువస్తుందనే కారణంగా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న మహా వృక్షాన్నే నరికివేసిన వైనం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. 50 ఏండ్లు ఉన్న చెట్టును నరికివేయడం పట్ల పర్యవరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ మహావృక్షం ఎక్కడ ఉంది.. ఎవరు నరికి వేశారో ఇప్పుడు చూద్దాం..
Assembly Elections: రెండు రాష్ట్రాల్లో లీడ్‌లో ఉన్న ప్రముఖులు వీరే
హెచ్చరికలు లెక్కచేయక.. రాత్రికిరాత్రే
నగరంలోని కేబీఆర్ పార్క్ (KBR Park) ఎదురుగా జీహెచ్ఎంసీ (GHMC) ఫుట్ పాత్ మీదున్న చెట్టును (Big Tree) రాత్రికి రాత్రే నరికేశారు. తమ వ్యాపారానికి అడ్డు వస్తుందనే కారణంగా లగ్జరీ సికారా క్లినిక్స్, ఫెమినా ఫ్లాంట్ స్టూడియో సెలూన్ నిర్వాహకులు ఈ మహా వృక్షాన్ని తొలగించారు. రోడ్డు మీద వెళ్లేవారికి చెట్టు, దాని కొమ్మలు కనిపించకుండా అడ్డువస్తున్నాయంటూ ఏకంగా సుమారు 50 ఏళ్ల చెట్టును నిర్ధాక్షణ్యంగా నరికివేశారు. ఈ చెట్టును నాటి సుమారు 50 సంవత్సరాలు పూర్తయ్యింది. అయితే రాత్రి సమయంలో సెలూన్, క్లినిక్‌కు చెందిన నిర్వాహకులు రాఘవేంద్ర రెడ్డి, శిరీష్ ఆలపాటి అనే వ్యక్తులు మెషిన్లతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు స్థానికులు తెలిపారు.
Elections: హర్యానా ఫలితాల్లో బిగ్ ట్విస్ట్..
అంతకుముందు రోజు కేబీఆర్ పార్క్ అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఈ భారీ వృక్షాలను నరకవద్దని వాళ్లను హెచ్చరించారు. సాయంత్రం పచ్చగా ఉన్న చెట్టు ఉదయాన్నే నేలమట్టం కావడం చూసి స్థానికులు సెంటిమెంటుతో రగిలిపోతున్నారు. ఈ దుర్మార్గానికి ఒడి గట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కేబీఆర్ పార్కులోని అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేందుకు అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నేలకూల్చిన భారీ వృక్షాలను పరిశీలించారు.
ఇవి కూడా చదవండి..
Dussehra: దసరాకు 6,304 ప్రత్యేక బస్సులు..
Bathukamma: ఏడో రోజు వేపకాయ బతుకమ్మ.. ఈరోజు ఏం చేస్తారంటే
Read Latest Telangana News And Telugu News