Share News

Janimaster: నా భర్తను ట్రాప్ చేసింది.. నరకం అంటే ఏంటో చూశా.. జానీ మాస్టర్ భార్య

ABN , Publish Date - Sep 28 , 2024 | 09:59 AM

Telangana: జానీమాస్టర్‌పై ఫిర్యాదు చేసిన బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని తెలిపింది.

Janimaster: నా భర్తను ట్రాప్ చేసింది.. నరకం అంటే ఏంటో చూశా.. జానీ మాస్టర్ భార్య
Jani Master Case

హైదరాబాద్, సెప్టెంబర్ 28: అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువతిపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Jani Master) కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. జానీమాస్టర్‌పై ఫిర్యాదు చేసిన బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు (Film Chamber of Commerce) జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని తెలిపింది. ‘‘ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది. నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లింది. నాకు అమ్మ వద్దు నాన్న వద్దు నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్‌పై తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. నా భర్త జానీ మాస్టర్‌ను ఇంటికి రాకుండా అడ్డుకునేది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్‌ను నువ్వు ఇష్టపడితే...ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన అంటూ నమ్మించింది’’ అని వాపోయింది.

Viral Video: వామ్మో.. ఇదెక్కడి సర్‌ప్రైజ్ రా బాబూ.. బర్త్‌డే విషెస్ పేరుతో ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్‌కు నిప్పు.. తర్వాతేం జరిగిందంటే..


న్యాయం చేయండి...

‘‘నా భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో బాధితురాలు అక్రమ సంబంధం ఉంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో కక్ష కట్టి తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టింది. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురిచేస్తుంది. బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు నా పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతుళ్ళదే బాధ్యత. నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను’’ అంటూ సుమలత ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు చేసింది.

Gandipet Reservoir: మరో రెండు గేట్ల ఎత్తివేత..


నేటితో కస్టడి ముగింపు

కాగా.. జానీమాస్టర్ కస్టడీ పిటిషన్‌ నేటితో ముగియనుంది. నాలుగు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీసుల కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. గత మూడు రోజులుగా జానీమాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. నేటితో కస్టడీ ముగియనుంది. అయితే విచారణలో భాగంగా యువతి గురించి జానీమాస్టర్ పలు కీలక అంశాలు బయటపెట్టాడు. బాధుతురాలే తనను వేధించినట్లు విచారణలో ఆయన వెల్లడించారు. ‘‘నాపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుంది. మైనర్‌గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధం. తన టాలెంట్‌ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చాను. తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా హింసించేది... ఎన్నోసార్లు బాధితురాలు నన్ను బెదిరింపులకు దిగింది.. నేను పడుతున్న ఇబ్బందిపై డైరెక్టర్ సుకుమార్‌ దృష్టికి తీసుకెళ్ళాను. సుకుమార్ పిలిచి మాట్లాడిన కూడా బాధితురాలిలో మార్పు రాలేదు. నాపై కుట్ర జరిగింది, వెనున ఉండి నాపై కుట్ర చేశారు. నా ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారు’’ అంటూ జానీ మాస్టర్ విచారణలో పోలీసులకు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

Indian Railways: పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల ప్రత్యేక రైళ్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 28 , 2024 | 10:04 AM