Share News

Akbaruddin Owaisi: ఆ స్కూల్ మాత్రం కూల్చకండి.. అక్బరుద్దీన్ ఓవైసీ సంచలనం

ABN , Publish Date - Aug 26 , 2024 | 03:59 PM

హైడ్రాపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలో గల ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై స్పందించారు. చెరువు కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఆ క్రమంలో అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Akbaruddin Owaisi: ఆ స్కూల్ మాత్రం కూల్చకండి.. అక్బరుద్దీన్ ఓవైసీ సంచలనం
Akbaruddin Owaisi

హైదరాబాద్: హైడ్రాపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలో గల ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై స్పందించారు. చెరువు కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఆ క్రమంలో అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. ఆ స్కూల్ కూల్చకండి.పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించా. వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారు. గతంలో నాపై కాల్పులు జరిగాయి. కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.కత్తులతో దాడి చేయండి. పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి అని’ అక్బరుద్దీన్ సూచించారు.


CM Revanth Reddy.jpg


స్కూల్ కూలుస్తారా..?

హైదరాబాద్ పరిసరాల్లో ఇతరులు కబ్జా చేసిన భూముల గురించి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సీఎం రేవంత్.. మీకు దమ్ముంటే ఆ నిర్మాణాలు కూల్చివేయాలని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. పాతబస్తీలో చెరువులు కబ్జాకు గురయ్యాయని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి గుర్తుచేశారు. ఆ కబ్జాలు తొలగించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని అడిగారు. చెరువు కబ్జా చేసి ఓవైసీ కాలేజీ నిర్మించారని గుర్తుచేశారు. ఆ కాలేజీని కూలుస్తారా అని అడిగారు. మజ్లిస్‌ పార్టీతో కాంగ్రెస్ పార్టీ సఖ్యంగా ఉంటోంది. ఈ క్రమంలో ఓవైసీ కాలేజీని కూలగొడతారా అని మహేశ్వర రెడ్డి ఛాలెంజ్ చేశారు. మహేశ్వర రెడ్డి కామెంట్ చేశారో లేదో.. ఆ వెంటనే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు.


akbar.jpg


దయచేసి ఆ పని చేయొద్దు

దయచేసి ఆ స్కూల్ కూల్చొద్దు అని కోరారు. పేద విద్యార్థుల ఆ పాఠశాల వరం లాంటిదని కోరారు. కొందరు కావాలనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ వైరంతో తాము నిర్మించిన స్కూల్ కూల్చాలని కోరడం సరికాదు. వేలాది మంది విద్యాబుద్దులు నేర్చుకునే స్కూల్ నేలమట్టం అయితే వారి బంగారు భవిష్యత్ నాశనం అవుతుందని అభిప్రాయ పడ్డారు. కావాలంటే నన్ను టార్గెట్ చేయండి.. అవసరమైతే బుల్లెట్ల వర్షం కురిపించాలని అక్బరుద్దీన్ కోరారు.


Hydra.jpg


కక్షతోనే ఇలా..

కొందరు మాపై కక్షగట్టి మరి నోటీసులు ఇస్తున్నారు. మా విద్యా సంస్థలను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కూల్చినా కుతుబ్‌మినార్‌ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తాం. 40 వేల మంది విద్యార్థులకు ఉచితవిద్య అందజేస్తున్నాం. నాపై కక్ష ఉంటే నన్ను కాల్చండి.. నాపై దాడులు చేయండి. నేను చేస్తున్న మంచి కార్యక్రమాలను మాత్రం అడ్డుకోవద్దు అని’ అక్బరుద్దీన్ ఓవైసీ సూచించారు.


హైడ్రా అంటే ఏంటీ..?

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల ముంచి హైడ్రా-(హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఏర్పడింది. ఒకప్పుడు చెరువులు, కుంటలతో ఉన్న హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఆ కళను కోల్పోయింది. కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో చినుకు పడితే రహదారులను చెరువులను తలపించే పరిస్థితి నెలకొంది. చెరువులను ఆక్రమించి, నాలాలను మూసివేయడంతో సమస్య ఏర్పడింది. వరదలకు పరిష్కరం చూపించేందుకు హైడ్రా ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైడ్రా విస్తరించారు. హైడ్రాకు చైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనర్‌గా ఉన్నారు. సిటీలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేసే పనిలో హైడ్రా నిమగ్నమైంది. ఆ క్రమంలో పలువురి నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు.


ranganath-hydra-comm.jpg


43.54 ఎకరాల భూమి స్వాధీనం

హైదరాబాద్ శివారులో 166 అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. 43.54 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. గాజులరామారంలో గల చింతల్ చెరువు ఒడ్డున అత్యధికంగా 54 నిర్మాణాలను నేలమట్టం చేశారు. రాజేంద్రనగర్‌లో గల భూమ్రుక్ డౌలాలో 45 నిర్మాణాలు.. గండిపేట్ చుట్టూ 24, ఖాన్ పూర్‌లో 14, చిలుకూరు ప్రాంతంలో 10 నిర్మాణాలను కూల్చివేశారు.

ఇవి కూడా చదవండి

CMRF Scam: సీఎం‌ఆర్‌ఎఫ్ స్కాంలో 17 ఆస్పత్రులపై కేసులు నమోదు

Kodandareddy: హైడ్రాపై ఎంఐఎం, బీఆర్‌ఎస్‌వి అడ్డగోలు విమర్శలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 26 , 2024 | 04:41 PM