CM Revanth Reddy: జార్ఖండ్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Feb 05 , 2024 | 08:40 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం జార్ఖండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరతారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జూడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి జార్ఖండ్ వెళుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం జార్ఖండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరతారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జూడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి జార్ఖండ్ వెళుతున్నారు. న్యాయ్ యాత్రలో పాల్గొని తిరిగి సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు.
కాగా సోమవారం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి సంతాప సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.
1972 నుంచి రెండేళ్ల పాటు నర్సారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పని చేసారు. ఎంపీగా, ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా పని చేసారు. జలగం వెంగళరావు మంత్రి వర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు. నర్సా రెడ్డి భారత స్వాతంత్య్ర సమరయోధుడు, నిజాం పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కోసం పోరాటంలో పాల్గొన్నారు. 1940 ప్రారంభం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీ కావడానికి ముందు అతను వరుసగా మూడు సార్లు శాసనసభ సభ్యుడిగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నారు. 1971లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం నర్సారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.