Share News

Kavitha Arrest: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. క్లియర్‌ కట్‌గా చెప్పేసిన ఈడీ!

ABN , Publish Date - Mar 16 , 2024 | 06:18 PM

Kavitha Custody Report: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) వరుస షాక్‌లు తగులుతున్నాయి. 7 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఈడీ ఇక రంగంలోకి దిగనుంది. కవిత కస్టడీకి సంబంధించి సంచలన విషయాలను ఈడీ రిలీజ్ చేసింది.

Kavitha Arrest: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. క్లియర్‌ కట్‌గా చెప్పేసిన ఈడీ!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) వరుస షాక్‌లు తగులుతున్నాయి. 7 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఈడీ ఇక రంగంలోకి దిగనుంది. కవిత కస్టడీకి సంబంధించి సంచలన విషయాలను ఈడీ రిలీజ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితనే కీలక వ్యక్తి.. ఈమె కుట్రదారు, లబ్ధిదారు అని ఈడీ తేల్చి చెప్పేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఈడీ స్పష్టం చేసింది. ఈ రెండు విషయాలే కాదు.. కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలే ఉన్నాయి. ఆ విషయాలన్నీ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. ఇక ఆలస్యమెందుకు చూసేయండి..

Kavitha: కవిత కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఈడీ..!



కస్టడీ రిపోర్టులో ఏముంది..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారుల్లో కవిత ఒకరు. స్కామ్‌లో కవిత కుట్రదారు, లబ్ధిదారు. శరత్‌రెడ్డి, మాగుంట రాఘవరెడ్డితో కలిసి ఆప్ నేతలకు రూ. 100 కోట్లు లంచం ఇచ్చారు. మార్జిన్ మనీని 12శాతానికి పెంచి.. అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించారు. లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారు. సమ్మన్లు జారీచేసిన తర్వాత 4 ఫోన్లలోని డేటాను ఫార్మాట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితనే కీలక వ్యక్తి. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిబంధనలు తనకు అనుకూలంగా ఉండేలా చూసుకోగలిగారు. అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారు. ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌ కోసం కవిత తనను సంప్రదించారని.. కేజ్రీవాల్ తనతో చెప్పినట్లు మాగుంట స్టేట్‌మెంట్‌ ఇచ్చారుఅని కస్టడీ రిపోర్టులో ఈడీ పేర్కొంది.


కోట్లు సంగతి ఇదీ..!

కవిత టీం లిక్కర్ బిజినెస్‌లో ప్రవేశించేందుకు చూస్తున్నందున ఆమెతో కలిసి ముందుకు వెళ్లాలని కేజ్రీవాల్ సూచించినట్లు.. మాగుంట చెప్పారు. హైదరాబాద్‌లో కవితతో భేటీలో ఆప్‌ నేతలకు రూ.100 కోట్లు ఇవ్వాలి.. వెంటనే రూ.50 కోట్లు ఇవ్వాలని కవిత చెప్పారని మాగుంట స్టేట్‌మెంట్‌‌లో చెప్పారు. కవిత సూచనతో రూ.25 కోట్లు మాగుంట రాఘవ ఇచ్చినట్టు స్టేట్‌మెంట్‌‌లో (రాఘవ విచారణ సమయంలో) క్లియర్ కట్‌గా చెప్పారు. రూ.25 కోట్లను అభిషేక్ బోయినపల్లి చెప్పిన అడ్రస్‌లో ఇచ్చినట్టు మాగుంట రాఘవ కూడా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కవితను పిలిచి ప్రశ్నించినప్పుడు ఇండో స్పిరిట్‌లో వాటా గురించి ప్రశ్నిస్తే ఖండించారు.. కానీ మాగుంట రాఘవ, బుచ్చిబాబుల మధ్య వాట్సాప్ చాట్‌లో కవితకు 33% వాటా ఉన్నట్లుగా ఉంది. మొబైల్ ఫోన్స్ విషయంలోనూ కవిత తప్పుడు సమాచారం ఇచ్చారు. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసే సమయంలో ప్రత్యేకించి అడిగిన ప్రశ్నలకు అసంబద్ధ, రాజకీయ సమాధానాలు ఇచ్చారు. సాక్షాలను కూడా కవిత ధ్వంసం చేశారు. కవిత ఇచ్చిన మొబైల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపిస్తే.. పది ఫోన్లలో కనీసం నాలుగు ఫోన్లను ఈడీ సమన్లు వచ్చిన ముందు ధ్వంసం చేశారు. విచారణలోనూ అసంబంద్ధ సమాధానాలు ఇవ్వడంతో అరెస్ట్ చేశాంఅని కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి


Updated Date - Mar 16 , 2024 | 07:14 PM