Share News

HCA: హెచ్‌సీఏ వివాదాలపై సుప్రీంకోర్టులో విచారణ

ABN , Publish Date - Oct 23 , 2024 | 05:10 PM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌‌‌లో వివాదాలు సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏ పాలనా సిఫార్సులకు సంబంధించి ఎక్కువ మంది మెంబర్లు కుటుంబ సభ్యులేనని సుప్రీంకోర్టు నియమించి జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సిఫార్సును వ్యతిరేకిస్తూ హెచ్‌సీఏ సభ్యులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

HCA: హెచ్‌సీఏ వివాదాలపై సుప్రీంకోర్టులో విచారణ
HCA

న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) వివాదాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇవాళ (బుధవారం) విచారణ జరిగింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ప్రత్యేక బెంచ్ వాదనలు విన్నది. ఈ కేసు తదుపరి విచారణను రేపు (గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ బెంచ్ నిర్ణయించింది.


కాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎలక్ట్రోరల్ జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ కోసం గతంలో జస్టిస్ ఎల్ నాగేశ్వరరావును సుప్రీంకోర్టు నియమించింది. హెచ్‌సీఏకి ఎన్నికలు నిర్వహించడమే కాకుండా.. నిర్వహణపై సిఫార్సులు చేయాలని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు‌కు సూచించింది. అయితే హెచ్‌సీఏ సభ్యుల్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులేనని ఆయన చేసిన సిఫార్సుపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. వారి పిటిషన్లపైనే ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది.


కాగా హెచ్‌సీఏలో కుటుంబ సభ్యులే ఎక్కువ మంది మెంబర్లుగా ఉన్నారని సుప్రీంకోర్టు దృష్టికి జస్టిస్ నాగేశ్వరరావు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉండడంతో హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణలో పలు అంశాలు ప్రభావితం అవుతున్నాయని ఆయన చెప్పారు. అయితే మెంబర్లు మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తున్నారు.


హెచ్‌సీఏపై ఆరోపణలు

హెచ్‌సీఏలో కాంట్రాక్టుకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు జరపాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. టెండర్ ప్రక్రియ, క్యాటరింగ్, ట్రావెలింగ్ సర్వీసులతో పాటు ఇతర అంశాలపై సమగ్ర అంశాలు బయటకు తీయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి ఇటీవలే స్పందించారు. హెచ్‌సీఏకి సంబంధించిన పలు అంశాలపై దర్యాప్తు జరపాలంటూ విజిలెన్స్ అదనపు డీజీకి లెటర్ రాశారు. హెచ్‌సీఏ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం అసోసియేషన్ పనితీరును ప్రభావితం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కీలకమైన అపెక్స్ కౌన్సిల్‌తో అవసరం మేరకు సంప్రదింపులు జరపకుండా కొంతమందే నిర్ణయాధికారాలు (ప్రెసిడెంట్, సెక్రటరీ) తీసుకుంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. టెండర్ లేకుండా ఐపీఎల్‌ కాంట్రాక్టులు అప్పగించడం హెచ్‌సీఏ ప్రతిష్ఠకు మసకబార్చుతాయని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

ఏపీలో లా అండ్ అర్డర్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

తుపాను ఎఫెక్ట్.. రెండు రైళ్లు రద్దు

For more TS News and Telugu News

Updated Date - Oct 23 , 2024 | 05:24 PM