Share News

ED Investigation: భూదాన్ భూముల భాగోతం.. ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:49 PM

Telangana: భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఈడీ ముందు విచారణకు వచ్చారు. బుధవారం ఉదయం సదరు ఐఏఎస్ అధికారి తన న్యాయవాదతో కలిసి ఈడీ విచారణకు హాజరయ్యారు.

ED Investigation: భూదాన్ భూముల భాగోతం.. ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి
Enforcement Directorate Investigation

హైదరాబాద్, అక్టోబర్ 23: భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యారు. భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఐఏఎస్‌కు ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌ కుమార్‌ పనిచేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం న్యాయవాదితో కలిసి అమోయ్ ఈడీ విచారణకు వచ్చారు. అనంతరం ఈడీ విచారణను ప్రారంభమైంది.

TG News: ఆ ప్రాంతంలో వరుసగా కుంగిపోతున్న రోడ్లు.. భయాందోళనలో ప్రజలు


కాగా.. 50 ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతం అయినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ విచారణలో భూదాన్ భూముల భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇదే వ్యవహారంలో అప్పటి ఎమ్మార్వో జ్యోతిపై కేసు నమోదు అయిన సంగతి విధితమే. జ్యోతిపై కేసు నమోదు అయిన తరువాత విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విజిలెన్స్ విచారణ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరిపింది. ఈ క్రమంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్ కుమార్ ఉండడంతో ఆయనకు నోటీసు జారీ చేసిన ఈడీ.. ఈరోజు విచారణ చేపట్టింది.


ఇదీ విషయం...

నాగరంలోని సర్వే నెంబర్ 181, 182 లోని 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఇందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డ్‌కు చెందినదని బోర్డ్ వాదిస్తోంది. అయితే ఈ భూమి జబ్బార్దస్త ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. తరువాత కాలంలో జబ్బర్దస్తూ ఖాన్ కొడుకు హజీ ఖాన్ ఈ 50 ఎకరాలు ల్యాండ్‌ను భూదాన్ బోర్డ్‌కు దానం చేశారు. అయితే 2021లో హజీఖాన్ వారుసరాలినంటూ 40 ఎకరాలు తనదేనని ఖాదురున్నీసా అనే మహిల దరఖాస్తు చేసింది. దీంతో ఆఘమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. క్షేత్ర స్థాయిలో ఆర్డీవో , తహశీల్దార్, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్ ఆమెకి అనుకూలంగా పని చేసినట్లు విచారణలో బయటపడింది.

Viral Video: బైక్ అంటేనే భయం పుట్టేలా చేశాడుగా.. వెనుక కూర్చున్న ఈ యువతి పరిస్థితి చూడండి..


అనంతరం ఈ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మకాలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో ఎన్నికల సమయంలో ఈ భూమికి సంబంధించి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ భూమి పై క్రయవిక్రయాలు జరగకుండా ధరణిలో నిషేధిత జాబితాలో అధికారులు పెట్టారు. ఈ వ్యహరం కోర్ట్‌కు చేరడంతో న్యాయస్థానం ఆదేశాలతో అప్పటి ఎమ్మార్వో జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్టార్, ఈఐపీఎల్ కన్స్ట్రాక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్‌పై కేసు నమోదు అయ్యింది. రెండు కేసులో భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరగడంతో ఈడీ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ విచారణ కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

KTR: రేవంత్ డబుల్ ఇంజన్‌కు మరో అర్థం ఇదే..

Viral Video: దూడకు జన్మనిచ్చిన గేదె.. అంతలోనే చుట్టుముట్టిన సింహాలు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 23 , 2024 | 12:52 PM