Rains: హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్న వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..
ABN , Publish Date - Jul 14 , 2024 | 08:09 PM
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చింతల్, సుచిత్ర, బాలానగర్, ఐడీపీఎల్, జీడిమెట్ల, సికింద్రాబాద్, బేగంపేట్ బోయిన్పల్లి, ప్యారడైజ్, చిలకలగూడ, ప్యాట్నీ, మారేడుపల్లి, అడ్డగుట్ట సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపై పెద్దఎత్తున వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరా సైతం నిలిపివేశారు.
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చింతల్, సుచిత్ర, బాలానగర్, ఐడీపీఎల్, జీడిమెట్ల, సికింద్రాబాద్, బేగంపేట్ బోయిన్పల్లి, ప్యారడైజ్, చిలకలగూడ, ప్యాట్నీ, మారేడుపల్లి, అడ్డగుట్ట సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపై పెద్దఎత్తున వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరా సైతం నిలిపివేశారు.
వర్షాలపై మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి సమీక్ష..
హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం టీమ్‌లతో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని వారిని ఆదేశించారు. ఈదురు గాలులకు చెట్లు విరిగే ప్రమాదం ఉన్నందున ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని ఆమ్రపాలి కోరారు. డీఆర్ఎఫ్ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనవసరంగా ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలకి హెచ్చరికలు జారీ చేశారు.