Share News

Damodara: క్యాన్సర్‌పై అవగాహన కల్పిద్దాం.. ప్రాణ నష్టాన్ని నివారిద్దాం

ABN , Publish Date - Oct 26 , 2024 | 10:54 AM

Telangana: క్రమశిక్షణ లేని జీవన విధానం సహా అనేక కారణాలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నాయని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇండియాలో ఏటా 14 నుంచి 15 లక్షల కేసులు నమోదవుతుంటే, తెలంగాణలో 50 నుంచి 60 వేల కేసులు నమోదవుతున్నాయన్నారు. క్యాన్సర్ ‌గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.

Damodara: క్యాన్సర్‌పై అవగాహన కల్పిద్దాం.. ప్రాణ నష్టాన్ని నివారిద్దాం
Minister Damodara rajanarsimha

హైదరాబాద్, అక్టోబర్ 26: ఎమ్‌ఎన్‌జీ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వాక్ కార్యక్రమంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయన్నారు. నాన్ కమ్యునికేబుల్ డిసీజ్‌లు అన్నింటిలోకెల్లా క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమన్నారు.

Telangana: కలెక్టర్ ఏం చేస్తోంది.. భర్త పక్కన పడుకుందా.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..


క్రమశిక్షణ లేని జీవన విధానం సహా అనేక కారణాలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నాయన్నారు. ఇండియాలో ఏటా 14 నుంచి 15 లక్షల కేసులు నమోదవుతుంటే, తెలంగాణలో 50 నుంచి 60 వేల కేసులు నమోదవుతున్నాయన్నారు. క్యాన్సర్ ‌గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించి, ప్రాణ నష్టాన్ని నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.


ఉచితంగా స్క్రీనింగ్, ట్రీట్‌మెంట్..

మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని.. మొత్తం ఉమెన్ క్యాన్సర్ బర్డెన్‌లో 14 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధిత కేసులే ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారని.. దీనిపై అవగాహన కల్పించి, స్క్రీనింగ్ చేస్తే ఎర్లీ స్టేజ్‌లో రోగ నిర్ధారణ చేయొచ్చని చెప్పారు. తద్వారా క్యాన్సర్‌ను పూర్తిగా నయం అయ్యేలా ట్రీట్‌మెంట్ అందించవచ్చన్నారు. ప్రతి మహిళా స్క్రీనింగ్ చేయించుకోవడానికి ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం ఉచితంగా స్క్రీనింగ్, ట్రీట్‌మెంట్ అందిస్తోందని తెలిపారు. ప్రతి గ్రామంలో మొబైల్ ల్యాబ్స్ ద్వారా ఉచితంగా స్క్రీనింగ్ చేయిస్తామన్నారు. 6 క్యాన్సర్ రీజినల్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నామని.. ఈ సెంటర్లలో డాక్టర్లు, పూర్తి స్థాయిలో ఎక్విప్‌మెంట్ తీసుకొస్తామన్నారు. ఈ సెంటర్లు అన్నింటికీ ఎంఎన్‌జే హాస్పిటల్ హబ్‌గా ఉంటుందని వెల్లడించారు.

HYDRA: నాన్‌స్టాప్ కూల్చివేతలు.. ఎన్నో ఆరోపణలు.. హైడ్రా వంద రోజుల ప్రయాణం ఇదీ


త్వరోలనే పాలియేటివ్ రిహాబిలిటేషన్ సెంటర్లు

క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఒక్కరోజులోనో, ఒక్క వారంలోనో అయ్యేది కాదని.. నెలలు, సంవత్సరాల తరబడి సాగుతుందన్నారు. పేషెంట్లకు ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా అవసరమని.. దానికోసమే పాలియేటివ్ రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. డయాబెటీస్ క్లినిక్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.


ఆకస్మిక పర్యటన

కాగా.. క్యాన్సర్ వాక్ అనంతరం క్యాన్సర్ హాస్పిటల్‌‌లో మంత్రి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఏమ్‌ఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో స్వయంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో పాథలాజి ల్యాబ్స్, పెట్ స్కాన్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, మెమ్మో గ్రామ్, పేషంట్ కేర్ పార్ట్స్, బోన్ స్కాన్, అల్ట్రా సౌండ్ విభాగాలతో పాటు పాలియేటివ్ కేర్ యూనిట్లను పరిశీలించారు. వాటి వినియోగంపై ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ‘‘ రోజుకి ఎంత మంది క్యాన్సర్ రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు’’ అనే విషయాన్ని డాక్టర్లు నర్సింగ్ సిబ్బందితో పాటు ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు వచ్చిన రోగుల బాగోగులను, సమస్యలను కూడా మంత్రి దామోదర రాజనర్సింహ అడిగి తెలుసుకున్నారు.


ఇవి కూడాచదవండి..

Viral Video: ఓర్నీ.. ఇంతకు తెగిస్తారా? ప్రజల కళ్ల ముందే కిడ్నాప్.. చివరకు బయట పడిన షాక్ ఏంటంటే..

Hyderabad: ధన్‌తేరాస్‌.. పసిడి కొందాం పదా!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 26 , 2024 | 10:54 AM