KTR: ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో’.. కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్..
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:03 PM
కేటీఆర్ బామ్మర్ది రాజ్ ఫాంహౌజ్‌లో రేవ్ పార్టీ నిర్వహించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ టార్గెట్‌గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో.. బామ్మర్ది ఫాంహౌజ్‌లోనే రేవ్ పార్టీలా? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో.
హైదరాబాద్, అక్టోబర్ 27: కేటీఆర్ బామ్మర్ది రాజ్ ఫాంహౌజ్‌లో రేవ్ పార్టీ నిర్వహించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ టార్గెట్‌గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో.. బామ్మర్ది ఫాంహౌజ్‌లోనే రేవ్ పార్టీలా? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో. సుద్దపూసను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయ్.’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్ పై రాజీధోరణి ఎందుకు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారాయన. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాల్సిందేనని అన్నారు. బడా నేతలతోసహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలుండాలన్నారు.
ఇక ఇదే వ్యవహారంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైతం తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఒక వైపు డ్రగ్స్ రహిత తెలంగాణా చేస్తామని ప్రకటిస్తోందని.. మరోవైపు శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలు, రావ్‌ల పార్టీల పేరుతో విచ్చలవిడిగా డ్రగ్స్ దందా జరుగుతోందన్నారు. విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు, కొకైన్‌లు విచ్చల విడిగా తెచ్చి భాగ్యనగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారని ఫైర్ అయ్యారాయన. శనివారం రాత్రి హైదరాబాద్ శివావర్లలో బాగా ఫేమస్ అయిన ఫామ్‌హౌస్‌లో అర్థరాత్రి రేవ్ పార్టీ జరుగుతోందని.. వీఐపీల పిల్లలు ఉన్నారంటూ అనేక వార్తలు వచ్చాయన్నారు రఘునందన్.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫామ్‌హౌజ్ ఒనర్‌తో కుమ్మక్కు కాకపోతే డీజీపీ ఆ ఫామ్‌హౌజ్ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్‌ను వెంటనే రిలీజ్ చేయాలని రఘునందన్ డిమాండ్ చేశారు. 12 గంటల్లోగా సీపీఫుటేజీని రిలీజ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ని, డీజీపీ జితేందర్‌ను డిమాండ్ చేస్తున్నానన్నారు. ఫామ్‌హౌజ్‌లో ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేసినప్పుడు ఫామ్ హౌజ్ లోపల, బయట ఉన్న సీసీ ఫుటేజీని వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జన్వాడ ఫామ్ హౌజ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లు రాజీ పడ్డారని వార్తలు వస్తున్నాయన్నారు. 12 గంటల్లోగా ప్రెస్ మీట్ పెట్టి వివరాలను వెల్లడించాలన్నారు. లేదంటే సీసీఫుటేజీ ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందన్నారు ఎంపీ రఘునందన్. రేవంత్ రెడ్డి పొల్యూట్ కాకపోతే జన్వాడ ఫామ్‌హౌజ్‌లో శనివారం రాత్రి ఏం జరిగిందనేది ప్రజలకు తెలియజేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ శివారులో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్‌హౌజ్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అర్థరాత్రి సమయంలో రైడ్స్ నిర్వహించారు. రేవ్ పార్టీని భగ్నం చేశారు. 35 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. విజయ్ మద్దూరి అనేక వ్యక్తికి కొకైన్ డ్రగ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ రైడ్‌లో విదేశీ మద్యం, భారీగా లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. U/S 34A, 34(1), R/w 9 Of ఎక్సైజ్ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
Also Read:
అడ్డంగా బుక్కైన కేటీఆర్ బావమరిది.. ఆ ఫాంహౌస్‌లో..
ప్రేమ అంటే ఇదీ.. ఆవు కోసం ఎద్దు..
For More Telangana News and Telugu News..