Share News

Telangana: తెలంగాణలో ఆ రెండు గ్రామాలకు అరుదైన అవార్డులు

ABN , Publish Date - Sep 27 , 2024 | 04:30 PM

Telangana: 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీలలో పోటీలు నిర్వహించింది. ఈ పోటీలలో "క్రాఫ్ట్స్" కేటగిరీలో ఉత్తమ గ్రామంగా నిర్మల్ ఎంపిక కాగా.. "స్పిరిచ్యువల్ - వెల్నెస్ " కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల గ్రామం ఎంపికైంది.

Telangana: తెలంగాణలో ఆ రెండు గ్రామాలకు అరుదైన అవార్డులు
National awards for Nirmal and Somashila

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ రాష్ట్రానికి (Telangana State) రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్, సోమశిల అవార్డులు పొందాయి. 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీలలో పోటీలు నిర్వహించింది. ఈ పోటీలలో "క్రాఫ్ట్స్" కేటగిరీలో ఉత్తమ గ్రామంగా నిర్మల్ ఎంపిక కాగా.. "స్పిరిచ్యువల్ - వెల్నెస్ " కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల గ్రామం ఎంపికైంది.

YS Jagan: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది: జగన్


ఈరోజు (శుక్రవారం) ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ అవార్డులను ప్రదానం చేసింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిర్మల్, సోమశిల ఎంపికైన నేపథ్యంలో ఆ గ్రామాలకు చెందిన అధికారులు అవార్డులను అందుకున్నారు. నిర్మల్ జిల్లా నుంచి అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్ టాయ్స్, ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.పెంటయ్య... సోమశిల నుంచి పర్యాటక శాఖ అధికారి టి.నర్సింహా ఈ అవార్డులను అందుకున్నారు.


కాగా.. ఒక దేశ ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేసే అంశాల్లో పర్యావరణం ఒకటి. ప్రతిదేశంలోనూ చూడదగ్గ ప్రదేశాలు, కట్టడాలు అనేకంగా వుంటాయి. వాటిని అభివృద్ధిపరిచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయ వనరులుగా తీర్చితే దేశం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీని ది వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ ఏర్పాటు చేసింది. పర్యాటక అంశాల్లో ఈ అంతర్జాతీయ టూరిజం సంస్థ ప్రపంచ వేదికగా పనిచేస్తోంది. ఇది ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సెప్ట్‌ పేరిట వరల్డ్‌ టూరిజం డే నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘‘పర్యాటకం- శాంతి’’ నినాదంతో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పర్యాటక రంగం అభివృద్ధిలో పయనించాలంటే ముందుగా ప్రభుత్వాలు అవసరమైన నిధులను సమకూర్చాలి. పర్యాటక ప్రాంతాల ప్రాశస్త్యాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడ సదుపాయాలను తీర్చాలి. అంతకంటే ముఖ్యంగా ఆయా పర్యాటక ప్రాంతాల గురించి విస్తృతమైన ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అప్పుడే ఆయా పర్యాటక ప్రాంతాలను సందర్శించాలన్న ఉత్సాహం ఏర్పడుతోంది.

Big Breaking: తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్


తెలంగాణలో ఎన్నో అందమైన ప్రదేశాల ఉన్నాయి. ఉరుకులు పరుగుల జీవితానికి కాస్త విరామం ఇచ్చేందుకు అనేక మంది మంచి మంచి ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటుంటారు. ప్రకృతి అందాలు, చుట్టూతా పచ్చదనంతో ఉండే ప్రదేశాలను పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. అనంతగిరి హిల్స్, వరంగల్ భద్రకాళీ టెంపుల్, వేయి స్తంబాల గుడి, నిర్మల జిల్లాలోని బాసర ఆలయం, నిర్మల్ కోట, ఆదిలాబాద్ జైనాత్ ఆలయం, గాయత్రి, కుంటారి, పొచ్చెర జలపాతాలు, నిజామాబాద్‌లోని కంఠేశ్వర్ ఆలయం, డిచ్‌పల్లి రామాలయాలు, సారంగాపూర్ హనుమాన్ మందిర్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాచీన ఆలయాలు, వారసత్వ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ఖిల్లాలు, జలపాతలు ఎన్నో తెలంగాణలోని 33 జిల్లాలో విస్తరించి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

ఎమ్మెల్యే కొలికపూడిపై అధిష్ఠానం ఆరా

IPL 2025: ఐపీఎల్ 2025 మ్యాచ్‌ల సంఖ్యపై కీలక అప్‌డేట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 27 , 2024 | 04:35 PM