Share News

Janimaster: జానీమాస్టర్‌కు బెయిల్ మంజూరు.. ట్విస్ట్ ఏంటంటే

ABN , Publish Date - Oct 03 , 2024 | 11:29 AM

Telangana: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టులో కాస్త ఊరట లభించింది. జానీ మాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. కేవలం ఐదు రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Janimaster: జానీమాస్టర్‌కు బెయిల్ మంజూరు.. ట్విస్ట్ ఏంటంటే
Choreographer Johnny Master

హైదరాబాద్, అక్టోబర్ 3: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Choreographer Jani Master) రంగారెడ్డి కోర్టులో (Ranga Reddy Court) కాస్త ఊరట లభించింది. జానీ మాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. కేవలం ఐదు రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్‌కు ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో జానీ మాస్టర్‌ ఉన్నారు. బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో 6న జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

Viral: అంతరిక్షం నుంచి దూకి.. గంటకు 1,357 కిలోమీటర్ల వేగంతో కిందకొస్తూ..


కాగా.. అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్‌‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని హైదరాబాద్‌‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గా ల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3వ తేదీ వరకు (14 రోజుల) రిమాండ్‌ విధించారు. దీంతో ప్రస్తుతం చంచల్‌గూడ్ జైలులో ఉన్నారు. అలాగే జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలవగా.. నాలుగు రోజుల పాటు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది.

KISHAN REDDY: ఫోన్ ట్యాపింగ్‌లో సెలబ్రేటీలను టార్గెట్ చేశారు.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్


దీంతో జానీమాస్టర్‌ను నాలుగు రోజుల పాటు నార్సింగ్ పోలీసులు విచారించారు. పోలీసుల కస్టడీలో బాధితురాలే తనను వేధింపులకు గురిచేసిందంటూ జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ అంశానికి సంబంధించి జానీ మాస్టర్ భార్య సుమలత ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసింది. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందని.. ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని పేర్కొంది. తన భర్త జానీపై లేని పోనీ ఆరోపణలు చేసిన మహిళా కోరియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు నేపథ్యంలో సుమలత నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. దీంతో వివరణ ఇచ్చేందుకు నిన్న (బుధవారం) ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ముందు సుమలత హాజరయ్యారు. మహిళా కొరియోగ్రాఫర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి జానీ మాస్టర్ భార్య అందించారు. సుమలత దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు.


ఇవి కూడా చదవండి...

AV Ranganath: హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు సన్మానం..

Bathukamma: రెండో రోజు అటుకుల బతుకమ్మ.. విశిష్టత ఇదే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 03 , 2024 | 04:46 PM