Share News

TGSRTC: ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ ఛార్జీల పెంపు..

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:14 PM

TGSRTC: పండుగ వేళ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం. దసరా వేళ స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టేందుకు సిద్ధమైంది. దసరా రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని ప్రకటించిన ఆర్టీసీ.. ఆ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది.

TGSRTC: ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ ఛార్జీల పెంపు..
TGSRTC

హైదరాబాద్, అక్టోబర్ 09: పండుగ వేళ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం. దసరా వేళ స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టేందుకు సిద్ధమైంది. దసరా రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని ప్రకటించిన ఆర్టీసీ.. ఆ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది. దసరా రద్దీ నేపథ్యంలో ప్రత్యేకంగా 6,300 బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ ప్రకటించారు. అలాగే మహాలక్ష్మి స్కీమ్ కింద మరో 600 బస్సులను అదనంగా నడిపిస్తున్నామన్నారు. అయితే స్సెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటాయని సజ్జనార్ స్పష్టం చేశారు. రిటర్న్ జర్నీలో ఖాళీగా బస్సులు రావాల్సి ఉంటుందని.. అందుకే కొంత ఛార్జీలు పెంచడం జరిగిందని సజ్జనార్ వివరించారు.


ఇప్పటికే కొన్ని బస్సులు నడుస్తున్నాయని.. గురువారం నుంచి మొత్తం బస్సులను నడిపిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అయితే, మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ చేసే మహిళలు తప్పకుండా తమ ఆధార్ కార్డు చూపించాలని స్పష్టం చేశారు. కార్డు చూపించకుండా ఆర్టీసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగొద్దని కోరారు.


ప్రయాణికులతో బస్ స్టేషన్స్ కిటకిట..

దసరా సందర్భంగా నగరంలోని ప్రజలు తమ తమ సొంతూళ్లకు పయనం అవుతున్నారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు హాలిడేస్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో హైదరాబాద్‌లో హాస్టళ్లలో ఉండి చదువుకునే కాలేజీ విద్యార్థులంతా ఊరు బాట పట్టారు. పెద్దలు సైతం తమ తమ సొంతూళ్లకు పయనమవుతుండటంతో ఆర్టీసీ బస్టాండ్‌లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇప్పటికే ప్రయాణికులకు సరిపడా బస్సులు లేవని ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. మరో రెండు రోజులు పోతే.. ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. మరిన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ యాజమాన్యానికి ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Also Read:

కస్టమర్లకు బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు

దుర్గమ్మ దర్శనానంతరం సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివే

హిందువుల మధ్య కాంగ్రెస్‌ చిచ్చుపెడుతోంది..

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 09 , 2024 | 04:19 PM